Thursday, May 2, 2024

రగులుతున్న రవి

- Advertisement -
- Advertisement -

కుతకుతలాడుతున్న సూర్య లావా, సుదూరానికి పల్లీ చెక్కీలా…
నాసా సోలార్ టెలీస్కోప్‌కి చిక్కిన మొట్టమొదటి సూర్యుడి చిత్రాలు

ప్రతి సెకనుకు మండుతున్న 50లక్షల టన్నుల హైడ్రోజన్
5 బిలియన్ సంవత్సరాల నుంచి అదే పనిగా జ్వలిస్తున్న వాయుకూపం

 

హవాయి : భగభగ మండే సూర్యుడి రూపం ఏమిటనేది అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. అయితే ఖగోళ అందులోనూ సౌరవ్యవస్థలో తొలిసారిగా సూర్యుడి ఉపరితల ఆవిష్కరణం జరిగింది.సూర్యుడి స్వరూప స్వభావాలను కళ్లకు కట్టినట్లుగా తెలిపే అత్యంత నిర్థిష్ట స్పష్ట సాంద్రతతో కూడిన ఛాయాచిత్రాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వారు ఈ అద్భుత ఛాయాచిత్రాన్ని తమ డేనియల్ కె ఇనోయి సోలార్ టెలీస్కోప్‌తో క్లిక్ మన్పించారు. ఇప్పుడు ఈ చిత్రాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. సౌర శాస్త్రం, సౌర కుటుంబమే ఖగోళ పరిణామాలకు అత్యంత కీలకం. అయితే సూర్యుడి గురించి పరిశోధనలు ఇప్పటివరకూ ముందుకు సాగలేదు. అయితే ఇప్పటి చిత్రాలతో సూర్యుడి గురించి తెలుసుకోవడానికి, భూ గ్రహంపై ప్రభావం, సూర్యుడి అంతర్గత ప్రక్రియ వంటి విషయాలపై సరైన విధంగా శాస్త్రీయ పరిశోధనలకు వీలేర్పడుతుందని భావిస్తున్నారు. సూర్యుడు అల్లకల్లోలిత , మరిగే వాయువుల కూపంగా ఉన్నట్లు స్పష్టం అయింది. కణజాల నిర్మిత ఉపరితంలో ప్రతి కణం దాదాపుగా ఒక మహానగరం అంతా పెద్దదిగా ఉంటుంది. దీనిలోని రగిలే పరిణామానికి కణాలలోని అంతర్గత స్వభావం కారణమని విశ్లేషిస్తున్నారు.

13 అడుగుల పొడవైన సోలార్ టెలీస్కోప్‌తో సూర్యుడి చిత్రాలను సమగ్రంగా తీశారు. సూర్యుడిలోని పరిణామాలను అంతరిక్ష వాతావరణంగా పరిగణిస్తారు. దీని ప్రభావం భూమిపై పడుతుంది. సూర్యుడిలోని అయస్కాంత క్షేత్రాల విస్ఫోటనంతో విమాన ప్రయాణాలపై ప్రభావం పడతుంది. ఎంతో కష్టపడి విస్తృతపర్చుకున్న శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుంది, విద్యుత్ కేంద్రాలు దెబ్బతిని, ప్రపంచవ్యాప్తంగా బ్లాకౌట్ దశ ఏర్పడుతుంది. అన్నింటికి మించి సూర్యుడిలో ఎటువంటి విపరీత పరిణామం తలెత్తినా అది దిక్సూచీ వ్యవస్థ అయిన జిపిఎస్‌ను దెబ్బ తీస్తుంది. దీనితో ఖండాంతర ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. . 1980 నుంచే సూర్యుడి తీవ్ర సాంద్రత చిత్రాలను తీసేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఖగోళభౌతిక శాస్త్రవేత్తల బృందం రాబర్ట్ రోస్నెర్ ఆధ్వర్యంలో పరిశోధనలు సాగిస్తూ వస్తున్నారు. సూర్యుడి ఉపరితలం అంతా ప్లాస్మాతో కూడుకుని ఉంటుంది. కణాలలో మండే స్వభావం వేర్వేరుగా ఉంటుంది. ఇంతకూ సూర్యుడిని విశేషస్థాయిలో చూపించగలిగిన ఈ టెలీస్కోప్‌నకు హవాయి దివంగత సెనెటర్ డేవిడ్ ఐనోయూయే పేరు పెట్టారు. దీని నిర్మాణం 2 010లో మొదలైంది. అయితే అత్యంత శక్తివంతమైన టెలీస్కోప్ రూపకల్పన విషయంలో ఆలోచనలు 1980లోనే ప్రముఖ సోలార్ సైంటిస్టు ప్రొఫెసర్ యుజిని పార్కర్ ఆధ్వర్యంలో ఆరంభం అయ్యాయి.

బ్రహ్మండ అణుకేంద్రం

భూగోళానికి అతి దగ్గరలో ఉండే గ్రహం సూర్యుడు. సూర్యుడు అత్యంత భారీ స్థాయి అణు కేంద్రంతో సమానం. ఇప్పటివరకూ భూగోళంపై లేనటువంటి అణు కేంద్ర సామర్థం సూర్యుడికి ఉందని వెల్లడయింది. ప్రతి సెకండుకు 50 లక్షల టన్నుల హైడ్రోజన్ ఇంధనం ఈ కేంద్రంలో రగులుతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పటికే 5 బిలియన్ ఏళ్ల నుంచి ఘనాతిఘనంగా కణకణ మండుతోందని , దీనికి ఇంకా 4.5బిలియన్ సంవత్సరాల జీవితకాలం మిగిలి ఉందని పరిశోధనలతో వెల్లడైంది. ఇక సూర్యుడిలో నుంచి వెలువడే ఇంధనం అంతరిక్షంలోకి ప్రతి దిశకు విస్తరిస్తుంది. ఇందులో ఏ దిశలో అయినా ఎటువంటి స్వల్ప పరిణామపు తేడా వచ్చినా ఆయా ప్రాంతాలు భస్మీపటలం అవుతాయని స్పష్టం అవుతోంది. భవిష్యత్తులో సూర్యుడి నుంచి ఈ విశ్వానికి ఏర్పడే ఉపద్రవాలు లేదా ఉపకారాలను సరైన రీతిలో విశ్లేషించుకునేందుకు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నూతన ఛాయాచిత్రాలు ఉపకరిస్తాయని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News