Tuesday, April 30, 2024

టైటిల్ వేటకు జకోవిచ్

- Advertisement -
- Advertisement -

tennis

ఫెదరర్, బార్టీ ఔట్,  హలెప్ ఓటమి
ఫైనల్లో ముగురుజా, కెనిన్,

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో జకోవిచ్ మాజీ విజేత, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ గార్బయిన్ ముగురుజా (స్పెయిన్), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ఫైనల్‌కు దూసుకెళ్లారు. మరోవైపు టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. కెనిన్ చేతిలో బార్టీ, ముగురుజా చేతిలో హలెప్ కంగుతిన్నారు. ఫైనల్లో ముగురుజాకెనిన్ తలపడుతారు.

హోరాహోరీ..

సెమీఫైనల్లో జకోవిచ్ 76, 64, 64తో ఫెదరర్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకున్నాడు. చిరకాల ప్రత్యర్థులు ఫెదరర్‌జకోవిచ్‌ల మధ్య జరిగిన పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. ఇటు జకోవిచ్ అటు ఫెదరర్ దూకుడుగా ఆడుతూ ముందుకు సాగారు. దీంతో తొలి సెట్ నుంచే హోరాహోరీ తప్పలేదు. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రం శ్రమించారు. ఒక దశలో ఫెదరర్ కాస్త పైచేయి సాధించినట్టు కనిపించాడు. అయితే జకోవిచ్ కూడా పట్టువీడకుండా పోరాడాడు. ఫెదరర్‌కు గట్టి పోటీ ఇస్తూ లక్షం వైపు నడిచాడు. ఇదే సమయంలో ఫెదరర్ కాస్త ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో జకోవిచ్ సఫలమయ్యాడు. ప్రత్యర్థిపై ఒత్తిడిని తెస్తూ పైచేయి సాధించాడు.

అంతేగాక టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మరోవైపు ఫెదరర్ కీలక సమయంలో వరుస తప్పిదాలకు పాల్పడి గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో సెట్ ఆరంభంలో కూడా పోరు ఆసక్తిగానే సాగింది. ఇద్దరూ కూడా పైచేయి సాధించేందుకు సర్వం ఒడ్డారు. దీంతో ప్రతి పాయింట్ కోసం హోరాహోరీ తప్పలేదు. ఫెదరర్ ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ఒక దశలో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ, కీలక సమయంలో మళ్లీ తప్పిదాలతో కష్టాల్లో పడ్డాడు. అప్పటి వరకు ఒత్తిడిలో కనిపించిన జకోవిచ్ మళ్లీ పుంజుకున్నాడు. ఫెదరర్ ఆధిపత్యానికి తెరదించుతూ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. తన మార్క్ షాట్లతో అలరించిన జకోవిచ్ మ్యాచ్‌పై పట్టు సాధించాడు.

జకోవిచ్ చెలరేగి ఆడడంతో ఫెదరర్ చతికిల పడ్డాడు. ఇదే సమయంలో పట్టు కోల్పోయాడు. ఇక, దూకుడును ప్రదర్శించిన జకోవిచ్ వరుసగా రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఫెదరర్ మళ్లీ కోలుకోలేక పోయాడు. ఆరంభంలో కాస్త బాగానే ఆడినా తర్వాత జకోవిచ్ జోరుకు చేతులెత్తేశాడు. అసాధారణ ఆటను కనబరిచిన జకోవిచ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. కాగా, శుక్రవారం అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా)ల మధ్య జరిగే సెమీస్ విజేతతో జకోవిచ్ ఫైనల్లో తలపడుతాడు. ఫైనల్ ఆదివారం జరుగుతుంది.

బార్టీకి కెనిన్ షాక్

మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీకి సెమీఫైనల్లోనే చుక్కెదురైంది. స్వదేశంలో జరిగే టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బార్టీ సెమీస్‌లోనే ఓటమి పాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. అమెరికా స్టార్ కెనిన్‌తో జరిగిన పోరులో బార్టీకి ఓటమి తప్పలేదు. బార్టీకెనిన్‌ల పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరికి కెనిన్ 76 (8/6), 75తో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తిగా మారింది. ఇటు బార్టీ, అటు కెనిన్ సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో ప్రతి పాయింట్ కోసం హోరాహోరీ తప్పలేదు. ఇద్దరి ఆట యుద్ధాన్ని తలపించింది. ఇద్దరు అసాధారణ పోరాట పటిమను కనబరచడంతో ఆధిపత్యం తరచూ చేతులు మారుతూ వచ్చింది.

ఇదే క్రమంలో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో కూడా ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోరాడారు. చివరికి కెనిన్ పైచేయి సాధించి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు హోరాహోరీగానే సాగింది. ఈసారి కూడా ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. చివరికి రెండో సెట్ కూడా టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న కెనిన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరింది.

Australian Open 2020 tennis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News