Sunday, April 28, 2024

సుపారీ గ్యాంగ్‌ల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

హత్యలు చేసేందుకు కిరాయి హంతకులు
చేతికి మట్టి అంటకుండా ప్లాన్ వేస్తున్న నిందితులు
రెండు కేసుల్లో సుపారీ గ్యాంగ్ పాత్ర
ఇబ్రహీంపట్నం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో బీహారీ ముఠాలు

Woman foud Murdered at Railway Station in Hitech City

మనతెలంగాణ, సిటిబ్యూరోః రాష్ట్ర రాజధానిలో హత్యలు చేయించేందుకు నిందితులు సుపారీ గ్యాంగ్‌లను ఆశ్రయిస్తున్నారు. తమతో విభేదాలు ఉన్న వారిని చేతికి మట్టి అంటకుండా పక్కకు తప్పించేందుకు పలువురు సుపారీ గ్యాంగ్‌లను సంప్రదిస్తున్నారు. వారికి భారీ మొత్తంలో ఆశ చూపి హత్యలు చేయిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన కాల్పులు, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన వారు సుపారీ గ్యాంగులు ఉన్నాయి. ఇందులో నిందితులుగా ఉన్న వారు బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్, ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడలో చోటు చేసుకున్న రియల్టర్ల జంట హత్యలు కిరాయి హంతకుల పనిగా తేలింది. ఇలాంటి ఉదంతాలు రాజధానిలో అనేకం వెలుగు చూస్తున్నాయి. హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని తీసుకునే మెుత్తాన్ని సుపారీ అంటారు. ఇది ముంబై మాఫియా సామ్రాజ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పదం.

Two foreigners killed in shootout in Mexico

అక్కడ కిరాయి హత్య చేయడానికి సిద్ధమైన వ్యక్తికి డబ్బుతో పాటు ఓ సుపారీ ఇస్తారు. అందుకే కిరాయి హత్యలు సుపారీలు ప్రాచుర్యం పొందాయి. హత్యలకు సుపారీ తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కిరాయి హంతకులు కొన్ని రోజులు ఆశ్రయం పొందుతున్నారు. దీని కోసం హోటళ్లు, లాడ్జిల్లో బస చేస్తున్నారు. అక్కడి నుంచే రెక్కీ, పథక రచన చేసి దానిని అమలు చేస్తున్నారు. తమ టార్గెట్ కదలికల్ని గమనించడానికి వారి ఇల్లు, వ్యాపార ప్రదేశాలకు సమీపంలో ఉన్న లా డ్జిల్లో హంతక ముఠాలు దిగుతున్నాయి. ఆపై అదును చూసుకుని హత్యలకు తెగబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జిలను ఆ స్టేషన్ సిబ్బంది రాత్రిపూట తనిఖీ చేయాలి.

అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా వాటిపై నిఘా ఉంచాలి. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి ఇది ఎంతో అవసరం. నిఘా ప్రక్రియ మెుక్కుబడిగా సాగడంతో అనేక కేసుల్లో ఏదైనా ఉదంతం జరిగిన అనంతరమే పోలీసులు గుర్తించగలుగుతున్నారు. ఒకసారి కిరాయి హత్యకు పాల్పడిన, కుట్ర చేసిన నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు ఆపై చేతులు దులుపుకుంటున్నారు. ఆ నేర గాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? అనే అంశాల్ని అవసరమైన స్థాయిలో పర్యవేక్షించడం లేదు. చైన్ స్నాచర్, పిక్ పాకెటర్‌పై ఉన్న నిఘా కూడా వీరిపై ఉండట్లేదు. అందుకు అవసరమైన సిబ్బంది, నిఘా యంత్రాంగం కూడా అందుబాటులో లేదు. వారిపై నిఘా కొరవడినందుకే నేరం జరిగిన తరవాతే పట్టుబడుతున్నారు. అరుదైన సందర్భాల్లోనే నేరం చేయడానికి ముందు దొరుకుతున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులకు బందోబస్తులు, రోటీన్ డ్యూటీల మినహా మిగిలిన వ్యవహారాలు చూడటం కష్టసాధ్యంగా మారిపోవడం సైతం ఈ నేరగాళ్లకు కలిసి వస్తోంది.ఈ కిరాయి హంతకులు ఎక్కువగా నాటు తుపాకులనే వాడుతున్నారు. వీరికి ఈ ఆయుధాలన్నీ ప్రధానంగా ఉత్తరాది నుంచి వచ్చి చేరుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కొన్ని చోట్ల నాటు తుపాకులు, కత్తులు విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వాటిని తీసుకువచ్చి విక్రయించే ముఠాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో వ్యవస్థీకృతంగా కిరాయి హత్యలు చేసే వాళ్లు అరుదు. ఈ నేపథ్యంలోనే పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి పని పూర్తి చేసుకువెళ్లే ఎక్కువగా ఉంటున్నారు.

నేరస్థులపై నిఘా తక్కువ….

హత్యలు చేసేందుకు డబ్బులు తీసుకుని నేరం చేస్తున్న వారిలో ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వారిపై స్థానిక పోలీసుల నిఘా ఉండడంలేదు. స్థానికంగా ఉంటున్న నేరస్థుల కదలికలను పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థులు ఇక్కడ నేరం చేసి జైలు నుంచి విడుదలైన తర్వాత వారి సొంత రాస్ట్రానికి వెళ్తారు. దీంతో వారిపై నిఘా పెట్టడం ఇక్కడి పోలీసులకు సాధ్యం కాదు,స్థానిక నేరస్థుడైతే అతడు ఏం ప్లాన్ చేస్తున్నాడో పలువురి ద్వారా సమాచారం సేకరించి ముందుగానే అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ముందుగా అదుపులోకి తీసుకోవడం సాధ్యం కావడంలేదు. దీనిని అడ్వాన్‌టేజ్‌గా తీసుకుంటున్న అంతరాష్ట్ర ముఠాలు నగరానికి వచ్చి హత్యలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News