Friday, May 3, 2024

ఆశారాంబాపుకు సుప్రీంలో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

Supreme Court dismisses Asaram Bapu's plea again

చికిత్స కోసం శిక్ష మినహాయింపునకు తిరస్కరణ

న్యూఢిల్లీ: పలు లైంగిక దాడి కేసుల్లో దోషిగా తేలిన ఆశారాంబాపు తాను ఆయుర్వేద చికిత్స తీసుకునేందుకు వీలుగా రెండు నెలలపాటు శిక్షను రద్దు చేయాలని కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌పై రాజస్థాన్ ప్రభుత్వ అభిప్రాయం తీసుకున్న ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టి తిరస్కరించింది. ఆశారాంది సాధారణ నేరం కాదని, ఆయన జైలులో ఉంటూ చికిత్స తీసుకోవచ్చునని సూచిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. తనను తాను ఆధ్యాతిక గురువుగా ప్రచారం చేసుకున్న ఆశారాం పలువురు మహిళలపై లైంగిక దాడులు జరిపినట్టు కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో యావజ్జీవశిక్ష పడింది. 2013లో తన ఆశ్రమంలో ఓ టీనేజీ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు నమోదైన కేసులో 2018, ఏప్రిల్ 25న జోధ్‌పూర్ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2002లో నమోదైన మరో కేసులో 20 ఏళ్ల కారాగార శిక్ష పడింది. సూరత్‌లోనూ ఆశారాంపై మరో లైంగికదాడి కేసు నమోదైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News