Saturday, April 27, 2024

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం రామానాయుడు భూముల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల లే అవుట్ చేసి విక్రయించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎపి సర్కార్, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మార్చి 11లోగా స్పందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2023 సెప్టెంబరు 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకే ఉపయోగించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా ఎలాంటి ఇతర కార్యకలాపాలకు భూములు వినయోగించవద్దని పేర్కొంది.

సినీ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం 2003లో విశాఖపట్నంలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ చేసి ఇతర కార్యకాపాలకు అనుమతినిచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాఖ పట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News