Wednesday, May 15, 2024

మర్యాద పాటించని న్యాయవాదికి సుప్రీం కోర్టు మందలింపు

- Advertisement -
- Advertisement -

Supreme Court reprimands senior lawyer for unparliamentary

 

క్షమాపణ చెప్పిన న్యాయవాది

న్యూఢిల్లీ : వీడియో కాన్ఫరెన్సు ద్వారా సుప్రీం కోర్టు విచారణ సాగిస్తున్న సమయంలో ఒక న్యాయవాది మంచంపై టి షర్టుతో పడుకుని కనిపించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. విచారణ సమయంలో కనీసం కోర్టు మర్యాద పాటించాలని హితవు పలికింది. దీనిపై ఆ న్యాయవాది కోర్టుకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. జస్టిస్ ఎస్. రవీంద్రభట్ ఆ క్షమాపణను అంగీకరించారు. విచారణ సమయంలో న్యాయవాదులు ఎవరైనా కోర్టుకు హాజరైనప్పుడు చక్కని దుస్తులు ధరించి గౌరవ మర్యాదలు పాటిస్తారని కోర్టు భావిస్తుందని, అసమంజసమైన వాటివేవైనా విడిచిపెట్టాలని, అలాంటివేవైనా వారి ఇంటి గోప్యతలో సహించదగినవి తప్ప కోర్టులో కాదని సూచించారు. హర్యానా రివారీ లోని ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును బీహార్ జెహనాబాద్‌కు తరలించాలని కోరుతో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టినప్పుడు ఈ సంఘటన జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News