Sunday, April 28, 2024

ఫ్లిప్‌కార్ట్‌పై ఎన్‌సిఎల్‌ఎటి ఆదేశాలపై సుప్రీం స్టే

- Advertisement -
- Advertisement -

Supreme Court stay on NCLAT orders on Flipkart

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఊరట లభించింది. ఆధిపత్య స్థానాన్ని వినియోగించుకుంటుందని ఆరోపిస్తూ ఫ్లిప్‌కార్ట్‌పై సిసిఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) మళ్లీ దర్యాప్తును చేపట్టాలని ఎన్‌సిఎల్‌ఎటి ఆదేశించగా, ఈ ఆర్డర్‌పై ఫ్లిప్‌కార్ట్ సుప్రీంను ఆశ్రయించింది. బుధవారం సుప్రీం కోర్టు గతంలో ఎన్‌సిఎల్‌ఎటి జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేసింది. ఈమేరకు ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్ (విక్రేతల సంస్థ), సిసిఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Court stay on NCLAT orders on Flipkart

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News