Sunday, April 28, 2024

ఫ్లిప్‌కార్ట్‌లో 7 శాతం ఉద్యోగులు కట్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పనితీరు ఆధారంగా సుమారు 5 నుంచి -7 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ తొలగింపు కారణంగా 1100- నుంచి 1500 మంది ఉద్యోగులపై వేటు ప్రభావం ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియం 2024 మార్చి, -ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఇంతకుముందు రిక్రూట్‌మెంట్‌ను ఒక సంవత్సరం పాటు నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

ఫ్లిప్‌కార్ట్ గత రెండేళ్లుగా పనితీరు ఆధారంగా ఏటా ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. మింత్రా మినహా కంపెనీ ప్రస్తుత శ్రామిక శక్తి 22,000 వరకు ఉంది. నివేదికల ప్రకారం, ఇప్పుడు ఈ తొలగింపు 1100 నుంచి -1500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. నివేదిక ప్రకారం, సంస్థ 2024 రోడ్‌మ్యాప్‌తో పాటు పునర్నిర్మాణం వచ్చే నెలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఖరారు చేస్తారు. లేఆఫ్‌లు ఉన్నప్పటికీ ఐపిఒను ఆలస్యం చేయాలనే కంపెనీ ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News