Sunday, April 28, 2024

క్రికెట్‌కు రైనా రిటైర్మెంట్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అతను ఐపిఎల్‌లో ఆడుతున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ట్విటర్‌లో వెల్లడించాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో సురేశ్ రైనా ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. 2005లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రైనా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక రైనా 226 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో 5615 పరుగులు చేశాడు. వన్డేల్లో ఐదు సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు సాధించాడు. అంతేగాక 36 వికెట్లను కూడా పడగొట్టాడు. మరోవైపు 78 టి20లు, 18 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా మొత్తం 7,988 పరుగులు సాధించాడు.

ఇక ఐపిల్‌ల్లో వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించిన రైనా రికార్డు స్థాయిలో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, మరో 39 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపిఎల్‌లో 25 వికెట్లను పడగొట్టాడు. ఐపిఎల్‌లో రైనా ఎక్కువగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మధ్యలో గుజరాత్‌కు కూడా సారథిగా వ్యవహరించాడు. కాగా రైనా 2021లో చివరి సారి ఐపిఎల్‌లో ఆడాడు. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన 160 చేశాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా రైనాను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఇలాంటి స్థితిలో క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని రైనా నిర్ణయించాడు.

Suresh Raina Retires From All Formats of Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News