Monday, May 13, 2024

అతనో మ్యాచ్ విన్నర్

- Advertisement -
- Advertisement -

Surya kumar yadav is match winner

ముంబై: యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాద వ్‌పై భారత మాజీ క్రికెటర్ సబా కరీం ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబై ఇండియన్స్ విజయా ల్లో సూర్యకుమార్ పాత్ర చాలా కీలకమన్నాడు. నిలకడైన బ్యాటింగ్‌కు మరో పేరుగా అతను నిలుస్తున్నాడని కొనియాడాడు. సూర్యకుమార్ వంటి ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ లభించడం ముంబై ఇండియన్స్ అదృష్టమని సబా కరీం అభిప్రాయపడ్డాడు. త్వరలో ఆరంభమయ్యే ఐపిఎల్ రెండో దశ మ్యాచుల్లో కూడా సూర్యకుమార్ చెలరేగి పోవడం ఖాయమన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా అతనికి ఉందన్నాడు. ఇక ఐపిఎల్‌లో ముంబై ఎక్కువగా అతనిపైనే ఆధారపడుతుందన్నాడు. దీంతో సూర్యకుమార్ ఎంతో ఒత్తిడికి గురవుతున్నాడన్నాడు. సాధ్యమైనంతగా అతనిపై ఒత్తిడి లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నాడు. అప్పుడే సూర్యకుమార్ తనదైన రీతి లో చెలరేగే అవకాశం ఉంటుందని కరీం పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News