Thursday, May 2, 2024

జ్యోతిక వ్యాఖ్యలు సరైనవే: సూర్య

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: తన భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని కోలీవుడ్ హీరో సూర్య తెలిపాడు. కోలీవుడ్‌లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో జ్యోతికి ఆలయాల నిర్వహణకు పెట్టే ఖర్చుతో పాటు హుండీలో వేసే నగదును ఆస్పత్రులకు కేటాయిస్తే బాగుంటుందని సూచనలు చేసింది. దీంతో అర్చకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని హిందూ సంస్థలు సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు పెట్టడంతో పాటు ట్రోల్ చేశారు. జ్యోతికి చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుపట్టారు. వివేకానంద్ వంటి గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు మానవ సేవ మాధవ సేవ అని అన్నారని, కరోనా సమయంలో దీనిని ఆచరించాలని తాము చెప్పామని సూర్య వివరణ ఇచ్చాడు. కులాలకి, మతాలకి అతీతంగా మానవత్వంగా ఉండాలని తమ పిల్లలకు నేర్పిస్తున్నామన్నారు. తమకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

 

Surya support Jyothika comments on Temples in TN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News