Monday, April 29, 2024

జయఛీంహ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టీమ్ బస్సులో మద్యం తాగుతూ దొరికిపోయిన హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ విద్యుత్ జయసింహా పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా క్రి కెటర్లతో వెళుతున్న బస్సులో జయసింహా మద్యం తాగుతున్న ఫొటో వైరల్ కావడంతో హైదరాబాద్ క్రికెట్ సం ఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తక్షణమే స్పందించారు. జయసింహాను కోచ్ పదవి నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జగన్‌మోహన్ రావు ఓ వీడియోను వి డుదల చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఇలాం టి తప్పులకు పాల్పడే వారి పై జీవితకాల నిషేధం విధించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. జ యసింహా టీమ్ బస్సులో మ ద్యం సేవిస్తున్న వీడియోలు, ఒక ఫిర్యాదు గురువారం హెచ్‌సిఎకు ఈమెయిల్ ద్వారా అందిందని, ఈ అం శంపై ఆరా తీస్తుండగానే, మీడియాలో వార్త కథనాలు వచ్చాయన్నారు.

ఇలాంటి తప్పులకు పాల్ప డే వారిపై జీవితకాల నిషేధం విధించేందుకు కూ డా వెనుకాడబోమని చెప్పారు. మహిళా జట్లు ఏ టూర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది? మ ద్యం సేవిస్తే, అసలు అదిబస్సులో ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు; తదితర అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి బా ధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్ రావు హామీ ఇచ్చారు. మహిళల గౌర వం, భద్రతకు భంగం కలిగించే వారిని క్షమించేది లేదన్నారు. వారు ఎంతటి పెద్ద స్థాయి వారైనా ఉ పేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మహిళా క్రికెటర్లతో తమ సిబ్బంది మాట్లాడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా దర్వాప్తు పూర్తి చేసి, బాధ్యులైన వా రిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సం ఘటనలు పునరావృ తం కాకుండా చూస్తామన్నారు. ఇదిలావుంటే మహిళా క్రికెట్ టీమ్ కోచ్ విద్యుత్ జయసింహా మ ద్య సేవిస్తున్న ఫొటోలను శుక్రవారం పలు ప్రధాన చానాళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఈ అంశం తె లుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

కా గా, ఈ అంశంపై తక్షణమే స్పందించి కోచ్ పదవి నుంచి జయసింహాను తప్పించిన హెచ్‌సిఎ అధ్యక్షు డు జగన్‌మోహన్ రావును పలువురు అభినందించారు. మహిళా క్రికెటర్ల గౌరవానికి భంగం క లిగించే వారిపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే మహిళలు క్రీడల్లో ఎలాంటి భయం లేకుండా పాల్గొనేందుకు వీలుకలుగుతుందని అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News