Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో టైక్వాండో ప్రీమియర్ లీగ్ 1.2

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రారంభ ఎడిషన్ విజయవంతం అయిన తర్వాత, టైక్వాండో ప్రీమియర్ లీగ్ డిసెంబర్ 19 -21 తేదీలలో TPL 1.2 కోసం హైదరాబాద్‌ నగరం సిద్ధమైంది. TPL 1.1 ను 58.1kg-67.9kg కేటగిరీ బరువు విభాగంలో పురుషులకు మాత్రమే నిర్వహించినట్లుగా, సీజన్ 1 లెగ్ 2 ప్రత్యేకంగా డిసెంబర్ 31, 2006న లేదా అంతకు ముందు జన్మించిన యువకుల కోసం మాత్రమే నిర్వహించబడుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మరొక ఆవిష్కరణగా, భారతదేశపు అత్యుత్తమ పురుష, స్త్రీ క్రీడాకారులు తమ జట్ల కోసం భుజం భుజం కలిపి పోరాడుతారు. పోటీకి అదనపు మసాలా జోడించనున్నారు.

ఇనీల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లాక్ బెల్ట్ వరల్డ్ (USA) ప్రో టైక్వాండో కార్పొరేషన్, JR ఇంటర్నేషనల్ టైక్వాండో అకాడమీ మరియు GKPR నిర్వహించే ఈ లీగ్‌లో దేశవ్యాప్తంగా 12 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ఆటగాళ్ళు దీనిలో పాల్గొనటానికి కుక్కివాన్ వరల్డ్ టైక్వాండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. “దేశంలోని ప్రతి తైక్వాండో ప్లేయర్‌కు వేదికను అందించడమే మా లక్ష్యం. ఈ లెగ్ మా టీన్ స్టార్స్ కోసం” అని టైక్వాండో ప్రీమియర్ లీగ్ క్రియేటర్, వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దువ్వూరి గణేష్ అన్నారు. “మా కార్యక్రమాల ద్వారా టైక్వాండోకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్నంత ప్రజాదరణ పొందెలా చేయాలని మేము ఆశిస్తున్నాము” అని అన్నారాయన.

టైక్వాండో ప్రీమియర్ లీగ్ చీఫ్ కమీషనర్, దక్షిణ కొరియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ జున్ లీ మాట్లాడుతూ టైక్వాండో కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, ప్రతి పిల్లవాడు తప్పక నేర్చుకోవాల్సిన అత్యుత్తమ రక్షణ రూపమన్నారు. ” మా అథ్లెట్లు సాంకేతికంగా చురుగ్గా, మరింత పోటీతత్వంగా మారడానికి TPL సహాయం చేస్తుంది” అని ఆయన చెప్పారు. JR ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ చైర్మన్, గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి ఆటగాళ్లకు వేదికను సృష్టించి, ఈ లీగ్‌ల పట్ల పరిపూర్ణత కోసం వారికి శిక్షణనిచ్చి ప్రోత్సహించేందుకు ఆసక్తిగా వున్నట్లుగా తన భావాలను వ్యక్తం చేశారు.

వెంకట కె గంజాం, కో-క్రియేటర్, ఫౌండర్, కొత్త టీమ్ ఓనర్‌లను లీగ్ లోకి స్వాగతించారు. “ఇమార్క్ డెవలపర్స్ (హైదరాబాద్ గ్లైడర్స్), గ్లోబల్ స్పోర్ట్స్ (హర్యానా హంటర్స్, బెంగళూరు నింజాస్, ఢిల్లీ వారియర్స్), ఓషన్ డైమండ్స్ (మహారాష్ట్ర అవెంజర్స్), గితికా తాకుల్దార్ (అస్సాం హీరోస్), విజయ్ కుమార్ బన్సాలీ (గుజరాత్ థండర్స్), డా.వంశీ (రాజస్థాన్ రెబల్స్) నేతృత్వంలోని ప్రారంభ ఎడిషన్‌లో మేము అనేక పెద్ద కార్పొరేట్లు, ప్రముఖ యజమానులను కలిగి వుంది.

“మేము ఇప్పుడు జిమ్మీ పటేల్ (చెన్నై స్ట్రైకర్స్), ఎస్ వినయ్ కుమార్ రెడ్డి (పంజాబ్ రాయల్స్)ను కూడా జోడించాము. ఇతర రెండు ఫ్రాంచైజీలు హిమాచల్ హరికేన్స్, లక్నో నవాబ్స్ TPL బోర్డులోనే ఉన్నాయి” అని ఆయన చెప్పారు. లీగ్ సహ-వ్యవస్థాపకురాలు నవనీత బచు, దేశంలో ఈ క్రీడ అభివృద్ధి చెందడం, మహిళలకు ఆత్మవిశ్వాసంతో సాధికారతను కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. “తాను 25 సంవత్సరాలుగా టైక్వాండోతో అనుబంధం కలిగి ఉన్నాను. తాను క్రీడల నుండి చాలా ప్రయోజనం పొందాను.దానిని తిరిగి ఇవ్వడానికి, భారతదేశంలో టైక్వాండో వృద్ధికి సహాయపడటానికి ఇది సమయం” అని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు వంశీ మార్లా స్పోర్ట్స్ ఫౌండేషన్, అగర్‌వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News