Sunday, April 28, 2024

బిజెపి ఎంపిలపై చర్యలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

Take action against BJP MPs

 

ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లపై డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన టిఆర్‌ఎస్ లీగల్ సెల్

మనతెలంగాణ/హైదరాబాద్‌: టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లక్సీలను చింపి వేయాలంటూ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పిలుపునివ్వడం, ప్రశాతంగా ఉన్న నగరంలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ఎంపి బండి సంజయ్‌ల వాఖ్యలపై టిఆర్‌ఎస్ నాయకులు మంగళవారం డిజిపి డాక్టర్ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎంపి అర్వింద్ ఒక పార్లమెంట్ సభ్యుడిలా కాకుండా వీధి రౌడీలా వ్యవహరించారని, అతనిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మధుసూదన్ వినతిపత్రంలో కోరారు. అదేవిధంగా ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పద్దతికాదన్నారు. హిందు,ముస్లింల మధ్య బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలు చోటుచేసుకునేలా ఉన్నాయన్నారు. అలాగే నగరంలో టిఆర్‌ఎస్‌కు సంబంధించిన బ్యానర్లను పెట్టుకోవడానికి లీగల్ గా అన్ని పర్మిషన్లు ఉన్న వాటిని చింపడం నేరమని, ఈక్రమంలో బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్క్ సమీపంలో ఉన్న ఫ్లక్సీలను తన అనుచరులతో కలిసి చింపారు ఎంపి అర్వింద్.

ఒక ఎంపి అయివుండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని లీగల్ సెల్ డిజిపి దృష్టికి తీసుకొచ్చింది. బిజెపి ఎంపిలు బండిసంజయ్, ఎంపి ధర్మపురి అర్వింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. డిజిపిని కలిసిన వారిలో టిఆర్‌ఎస్ కార్యదర్శి తాత మధు ,లీగల్ సెల్ ప్రతినిధులు కళ్యాణ్ ,లలితా రెడ్డి ,చంద్రశేఖర్ తదితరులున్నారు. ఇదిలావుండగా నగరంలోని రహదారులపై ఎక్కడ కనిపించినా టిఆర్‌ఎస్ ఫ్లక్సీలను తొలిగించాలంటూ ఎంపి ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు చేశారని పార్టీ కార్యదర్శి,పార్టీ లీగల్‌సెల్ బాధ్యుడు తాత మధుసూదన్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎపి ధర్మపురిపై ఫిర్యాదు అందిందని, ఫ్లక్సీల చింపివేతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అదేవిధంగా ఎంపి ధర్మపురి చేసిన వ్యాఖ్యలను సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు సాగుతోందని, విచారణ అనంతరం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News