Monday, May 6, 2024

కిషన్‌రెడ్డి నిస్సహాయ మంత్రి

- Advertisement -
- Advertisement -

KTR satirical comments on Kishan reddy

 

హైదరాబాద్ నగరానికి బిజెపి చేసిన సహాయం ఏమీ లేదు
గల్లీ ఎన్నికలకు ఢిల్లీ
లీడర్లు అవసరమా?
బిజెపిని గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్‌ను అమ్మేస్తారు
నేనూ ఒక తండ్రినే
విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆలోచించి నిర్ణయించాలి : కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరానికి బిజెపీ చేసిన సహయం అంటూ ఇంత వరకు ఏమీ లేదని, అభివృద్దిలో అన్ని అడ్డంకులు సృష్టించారని ఐటీ,మున్సిపల్ మంత్రి కేటిఆర్ అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో కేజి టూ పీజీ విద్యాంస్థల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర సహయ మంత్రి కిషన్ రెడ్డి ఒక నిస్సహాయ మంత్రి అని ఆయన ఇంతవరకు సికింద్రాబాద్‌కు చేసింది ఏమీ లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గల్లీ ( జిహెచ్‌ఎంసి) ఎన్నికలకు ఢిల్లీ లీడర్లు అవసరామాని ఆయన ప్రశ్నించారు. నగరానికి వరదలు వస్తే కేంద్ర నుంచి ఎటువంటి సాయం అందలేదని కాని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్సందించి రూ. 10 వేల సాయం అందిస్తుంటే దాన్ని కుట్రతో నిలువరించి నిరుపేదలకు సాయం అందకుండా చేశారని ఆయన ఆరోపించారు.

కేంద్రం హైదరాబాద్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కర్నాటక, గుజరాత్‌లలో వరదలు వస్తే వెంటనే స్పందించి పెద్ద ఎత్తున సాయం చేశారని ఇక్కడ మాత్రం తాము చేస్తుంటే అడ్డుకున్నారన్నారు. బిజెపిని గెలిపిస్తే రూ.25 వేల సాయం చేస్తామని చెబుతున్నారని, తాము ఇంత వరకు ఆరున్నర లక్షల మందికి సాయం చేశామని ఏ మాత్రం బిజెపికి చిత్త శుద్ది ఉన్నా వెంటనే రూ. 25 వేలు సాయం అందేలా చూడాలన్నారు. నగర అభివృద్ది కోసం లక్ష కోట్ల ప్యాకేజి తీసుకు వస్తే తాము అడ్డుకోమని పైగా సహకారిస్తామన్నారు.

మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారు ః బిజెపీ నాయకులు ఎంతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తూ లబ్దిపొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో అశాంతిని రేపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మేము ఎంఐఎం పార్టీతో ఎప్పడు పొత్తుపెట్టుకోలేదని, గత ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముస్లీంలు అంటే బిజెపీకి ఎందుకు అంత ద్వేశం అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.బిజెపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారని, బిన్‌లాడ్‌న్‌కు బాబర్‌కు హైదరాబాద్‌తో ఏమి సంబంధం అన్నారు.

బిజెపీ వస్తే గోల్కోండ, చార్మినార్ అమ్మేస్తారు…

బిజెపీకి ఓటేస్తే గోల్కోండ, చార్మినార్ పాటు జిహెచ్‌ఎంసినికూడా అమ్మేస్తారని, మంత్రి కేటిఆర్ అన్నారు. ప్రధాన మంత్రి‘ మోడి బేచో ఇండియా అంటుంటే.. మేము సోచో ఇండియా’ అంటున్నామన్నారు. లాభాల్లో ఉన్న కేంద్ర సంస్థలు కార్పోరేట్ శక్తులకుఅమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు. బిఎస్‌ఎన్‌ఎల్,బిపిఎల్ వంటి సంస్థలను మూసివేయడమే కాకుండా లాభాల్లో ఉన్న ఎల్‌ఐసి సంస్థ నిధులను పక్కదారి పట్టించి రైల్వేను ప్రైవేట్ పరం చేస్తూ కార్పోరేట్ శక్తులకు సహకరిసోందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఆయన జన్ ధన్ ఖాతాలో ప్రతి ఒక్కరికి రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారని, ఇంత వరకు ఎంతమందికి ఆ మొత్తం చేరిందో చెప్పాలని నిలదీశారు. బిజెపీ అంటే బ్లఫ్ జూమ్ పార్టీ అంటే ఆయన ఎద్దేవా చేశారు. నగరంలో మహిళలు వారం రోజులు పాటు సీరియల్స్, సినిమాలు బంద్ చేసి బిజెపీ లీడర్ల స్పీచ్ వింటే మరింత వినోదం లభిస్తుందన్నారు.

నేను కూడా ఒక తండ్రినే….

కోవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థలు తెరిచే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను ఒక తండ్రినే అని, ప్రస్తుత పరిస్థితుల్లో తన పిల్లలను కూడా పాఠశాలలకు పంపాలంటే ఆలోచిస్తానని చెప్పారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అందరూ ఇదే విధంగా ఆలోచిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరిస్తే సుమారు 600 మంది ఉపాధ్యాయులు, కొంతమంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వార్తలొచ్చాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కెటిఆర్ వివరించారు.రాష్ట్రంలో విద్యాసంస్థల సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించామన్నారు. నగరంలో నాలుగు లక్షలకు పైగా ప్రవేట్ ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, వారి సహయం చేసే అంశంపై కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఎదుర్కొంటున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.

అందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వం, మీకు కూడా న్యాయం చేస్తుందని అన్నారు.తాము చేయగలిగేదే చెబుతాం, చెప్పేది తప్పకుండా చేస్తామని అన్నారు. ఓటు అనేది వ్యక్తిగతమైన అంశంమని, ఎవరికి వారు ఆలోచించుకుని ఓటు వేస్తారని పేర్కొన్నారు. ఎవరి ఆలోచన వారికి ఉంటుందని, ఎవరో ఒకరు చెబితే మిగతా వాళ్లు ఏకపక్షంగా ఓటు వేస్తారని తాను భావించనని అన్నారు. హైదరాబాద్‌కు టిఆర్‌ఎస్ పార్టీ ఏం చేసిందో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి, విద్యాసంస్థల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News