Monday, April 29, 2024

50 ప్రశ్నలకు జవాబు చెప్పండి

- Advertisement -
- Advertisement -

KTR asked 50 questions to the BJP

 

? దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచింది కేంద్రం కాదా
? ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు
? 40కోట్ల పాలసీదారులున్న ఎల్‌ఐసిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు
? కరోనాకు ముందే ఆర్థికాన్ని అధోగతి పట్టించింది మీరు కాదా
? జిడిపిని పతనమొందించిన నిర్వాకం మీది కాదా
? కేంద్రంవలస కార్మికుల ఉసురు తీయలేదా
? 20లక్షల కోట్ల ప్యాకేజీలో 20 మందికైనా ఉద్యోగాల్విలేదు
? వేర్పాటువాద పార్టీలతో పదవులు పంచుకున్నది మీరు కాదా
? హత్రాస్ హతాచార బాలిక అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం కుటుంబసభ్యులకు నిరాకరించలేదా
? అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు రేట్లు దాదాపు రెట్టింపు చేశారెందుకు : చార్జ్‌షీటు ప్రవేశ పెట్టిన బిజెపికి కెటిఆర్ సూటి ప్రశ్నలు, ఎంఐఎంతో ఎటువంటి సర్దుబాట్లు లేవని స్పష్టీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్: రాజకీయ లబ్దికోసం కాశ్మీర్‌లో పిడిపి తో ఎన్నికల పొత్తుకుదుర్చుకున్న బిజెపి రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఎంఐఎం ఏకమయ్యాయని అసత్యప్రచారం చేస్తుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటి శాఖమంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ ఇంగిత జ్ఞానం లేకుండా టిఆర్‌ఎస్, ఎంఐఎం సర్కాక్ వైఫల్యాలు అంటూ ఛార్జిషీట్ విడుదలచేయడం ఏమిటని ఆయన నిదీశారు. మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కెటిఆర్ మాట్లాడుతూ ఉగ్రవాదులతో సంబంధాలున్న పిడిపితో బిజెపి దోస్తి చేసుకుందన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ఎంఐఎంకు ఎలాంటి రాజకీయ సర్దుబాటులేదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి నాయకులు అర్థసత్యాలను,సత్యాలను, పచ్చి అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గొబెల్ బ్రదర్స్‌లాగా ఇష్టాను సారంగా తప్పుడు విధానాలతో బిజెపి ప్రచారం చేస్తుందన్నారు. ఏడుసంవత్సరాల పసిగుడ్డుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ అభివృద్ధిలో దేశంలో నంబర్‌స్థానానికి ఎదిగిందన్నారు.

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై పచ్చి అబద్దాలతో, అర్థసత్యాలతో ప్రకాష్ జావదేకర్ ఛార్జిషీటు విడుదలచేశారన్నారు. దేశంలోని ఇతర రాష్టాలకంటే వృద్ధి రేటుసాధించినందుకా, హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసినందుకా, అంతర్జాతీయ స్ంథలు హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించినందుకా ప్రకాష్ జావదేకర్ చార్జీ షీట్ విడుదల చేశారని కెటిఆర్ నిలదీశారు. హైదరాబాద్‌లో మౌలికసదుపాయల కల్పనలు, ఐటి పార్కులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించినందుకా ప్రకాష్ జావదేకర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బిజెపి మతిస్థిమితం తప్పి మాట్లాడుతుందని తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం గురించి ఏమి తెలుసని ప్రకాష్ జావదేకర్ ఆరోపణలు చేశారని కెటిఆర్ నిలదీశారు.

కేంద్రం పై ఎన్ని ఛార్జీషీట్లు వేయాలి

ఎన్నికల్లో ప్రజలకు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి,ఆశలు చూపించి అధికారంలోకి రాగానే మర్చి పోయిన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై ఎన్ని ఛార్జి షీట్లు వేసినా తక్కువేనని ఆయన చెప్పారు.హైదరాబాద్‌లో ఐటిఆర్‌ను రద్దుచేసి కేంద్రం యువత పొట్టగొట్టిందన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంద్రలో కలిపి,సీలేరు ప్రాజెక్టును పోలవరంలో ముంచి అన్యాయం చేసిందని కెటిఆర్ విమర్శించారు. బయ్యారం ఉక్కు ప్రాజెక్టు నెలకొల్లుతానన్నారు,గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు, కాజీపేట రైల్వే కోచ్,నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రంపై ఎన్ని ఛార్జీషీట్లు వేసినా తక్కువన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను నాయశనం చేసింది కేంద్రం కాదాని కెటిఆర్ ప్రశ్నించారు. రైతుల నడ్డీవిరిచేలా నల్లచట్టాలను కేంద్రం తెచ్చిందని విచారం వ్యక్తం చేశారు. జన్‌ధన్‌పేరుతో ఓక్కొక్కరికి రూ.15 లక్షలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తామని చెప్పి మర్చి పోయిన ప్రధాని మోడీ పై 136 కోట్ల ప్రజలు ఛార్జీసీట్లు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డికి పావుసేరు అమ్ముతుంది

ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కేంద్రం అమ్ముతుందని కెటిఆర్ నిందించారు. అడ్డికి పావుసేరు విధానంతో ఎంతదొరికితే అంతకు అమ్మి వేస్తుందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఎవరిప్రయోజనాలకోసం అమ్మకానికి పెట్టారని కెటిఆర్ నిలదీశారు. అలాగే రైల్వేలు, విమానాలు, ఎల్‌సిలు, మహారత్న, నవరత్న కంపెనీలను అమ్మకానికి కేంద్రం బజారులో పెట్టిందన్నారు. కేంద్రప్రభుత్వ రంగసంస్థలను అమ్మి వేసేది గుజరాత్ కోసమా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇలా వ్యవహరిస్తున్నా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమీ మాట్లాడరని ఎద్దేవాచేశారు. బిజెపికి అవకాశం వస్తే హైదరాబాద్‌ను, చార్మినార్‌ను,గోల్కొండను కూడా అమ్మి వేస్తుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి,తెలంగాణ సాధించిన అభివృద్ధి గురించి కొన్నిగంటలపాటు చెపుతాను, తెలంగాణకు ఏమిచేసిందో బిజెపి ఒక్కటి చెప్పాలని కెటిఆర్ సవాల్ విసిరారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో బిజెపి చిచ్చుపెడుతుందని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రానికి 50 ప్రశ్నలు సంధించిన కెటిఆర్

అవగాహన రాహిత్యంతో కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ టిఆర్‌ఎస్ ఎంఐఎం వైఫల్యాలంటూ ఛార్జీషీట్ విడుదల చేయడాన్ని కెటిఆర్ తప్పుబడుతూ 50 ప్రశ్నలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఏ మాత్రం సహకరించని బిజెపి ఎన్నికల్లో అసత్యప్రచారానికి తెరతీసి తప్పడు విధానాలతో ప్రజల్లోకి వచ్చిందన్నారు. అయితే బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే 50 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కెటిఆర్ సవాల్ విసిరారు.ఈ ప్రశ్నల్లో ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచింది కేంద్రం కాదాని నిలదీశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు. 40 కోట్ల పాలసీదారులు ఉన్న ఎల్‌ఐసిని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది మీరు కాదా? 24 శాతం జిడిపిని పడగొట్టింది కేంద్రా కాదా? లాక్ డౌన్‌సమయంలో మానవత్వం సైతం చూపకుండా కఠినాధిగా వ్యవహరించి వాలసకార్మికుల ఉసురు తీసింది కేంద్రం కాదాని కెటిఆర్ ప్రశ్నించారు.

నయాపైస లేకుండా రోడ్డున పడ్డ కూలీల నుంచి రైల్వే టిక్కెట్లు పేరుతో పైసలు పిండుకుంది మీరు కాదాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ప్రశ్నించారు. లాక్‌డౌన్ తర్వాత 20లక్షల కోట్ల ప్యాకేజీలో కనీసం 20మందికైనా కేంద్రం ఉద్యోగం ఇవ్వలేదు,బంగ్లాదేశ్, శ్రీలంక అభివృద్ధి చెందుతుంటే భారత్ ఎందుకు అభివృద్ధి చెందడంలేదు, పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోని విధంగా కేంద్రం దెబ్బతీసింది, కేంద్రంలో బిసి మంత్రిత్వశాఖ ఎందుకు పెట్టడంలేదని కెటిఆర్ ప్రశ్నించారు. పన్నుల వాటా అడుగుతుంటే వేర్పాటువాదం అంటున్నారు, వేర్పాటువాద పార్టీలతో పదవులు పంచుకుంది మీరు కాదాని కేంద్ర బిజెపిని కెటిఆర్ నిలదీశారు. హథ్రాస్‌లో ఆడబిడ్డపై అఘాత్యం జరిగితే కనీసం అంతిమ సంస్కారానికి కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వంది మీరు కాదాని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా మీపాలనలో పెట్రోల్ రేట్లు దాదాపు రెట్టింపు ఎందుకు చేశారని కెటిఆర్ ప్రశ్నించారు.

తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసింది

కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావల్సిన కేంద్రం ప్రభుత్వం అమేరకు కృషి చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటుందని కెటిఆర్ ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చలేదు,కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. నీతి అయోగ్ సిఫారసు చేసినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ఒక్కపైసా ఇవ్వలేదు, తెలంగాణలో ఐఐఎం,ఐసర్ వంటి సంస్థలు రాకుండా ఆపుతున్నారు, కరీంనగర్ ట్రిబుల్ ఐటికి అనుమతులు ఎందుకు ఇవ్వడంలేదని కెటిఆర్ కేంద్రాన్ని సూటిగా నిలదీశారు. 15 ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రూ. 735 కోట్ల ప్రత్యే గ్రాంట్ల ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎగవేసి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలను సృష్టించాలని ప్రయత్నించింది వాస్తవంకాదాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని కెటిఆర్ ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నలకు బిజెపి నాయకులు సమాధానాలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ సెంచరీ కొడుతుందని రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. బిజెపి అసత్య ప్రచారాన్ని ప్రజలు ఓటుతో తిప్పికొడతారనే నమ్మకాన్ని కెటిఆర్ వ్యక్తం చేశారు. ప్రజలు సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని ,అభివృద్ధిని కోరుకుంటున్నారే కానీ బిజెపి సత్య ప్రచారాన్ని నమ్మడంలేదన్నారు. హైదరాబాద్ ప్రజలు బిజెపి సృష్టించే కర్ఫూలను కోరుకోవడంలేదని టిఆర్‌ఎస్ నాయకత్వంలో ప్రశాంత హైదరాబాద్‌ను కోరు కుంటున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి ఎంఐఎం పార్టీఅని చెప్పారు. రెంవస్థానంలో ఎంఐఎం నిలుస్తుందన్నారు. బిజెపి,కాంగ్రెస్ స్థానాలు ఎక్కడ ఉంటాయో ఆపార్టీలే తేల్చుకోవాలని కెటిఆర్ చెప్పారు.

మేయర్ అభ్యర్థి మహిళ

జిహెచ్ ఎంసి ఎన్నికల అనంతరం టిఆర్‌ఎస్ సెంచరికొట్టి మహిళా అభ్యర్థిని మేయర్ పీఠం మీద కూర్చోపెడుతుందని కెటిఆర్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించింది కేవలం టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.మహిళలను 85 స్థానాల్లో పోటీకి నిలిపిన ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని ఆయన గుర్తు చేశారు. ఎస్‌సి,ఎస్‌టి,బిసి, మైనారిటీ,ఉన్నతకులాలతో పాటుగా 8 మంది సెటిలర్స్ తో గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పోటీ చేయిస్తుందని కెటిఆర్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News