Sunday, April 28, 2024

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి

ఘట్‌కేసర్: ప్రతిఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి అన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఎన్‌ఎఫ్‌సి నగర్ 2వ వార్డు పరిధిలో బస్తీ దవాఖానా ఆవరణలో ఆదివారం వెంకటాపూర్ నీలిమ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు మన తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వలన ప్రతి ఒక్కరు అనారోగ్యాల బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల నిర్లక్షం వద్దని, ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీలిమ ఆస్పత్రి యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతోపాటు మండల పరిసర ప్రాంతాల ప్రజలకు 50 శాతం రాయితీతో కూడిన కార్డులు, గర్భిణి స్త్రీలకు నీలిమ 9 కార్డులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. ఆస్పత్రి యాజమాన్యం అందిస్తున్న రాయితీతో కూడిన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ శిబిరంలో 512 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫిసర్ నీలిమ చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యాదగిరి, మంజుల, శశికళ, ఆస్పత్రి సిబ్బంది, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
02జిటికెపి 03 ః వైద్య పరీక్షలు చేయించుకుంటున్న కౌన్సిలర్ రమాదేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News