Wednesday, May 1, 2024

విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజల్లో విజయ డెయిరీ ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ను మరింతగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో విజయ డెయిరీ ఉత్పత్తుల స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాల ఉత్పత్తులు, పాల పదార్ధాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

వివిధ ప్రాంతాలనుంచి ఎగ్జిబిషన్‌కు వస్తున్న ప్రజలను దృష్టిలో ఉంచుకునే ఇక్కడ స్టాల్‌ను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వాలు డెయిరీ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టలేదన్నారు. మూసివేత దశలో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ.700కోట్ల టర్నవర్‌కు తీసుకురాగలిగామని తెలిపారు.ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో విజయ డెయిరీ ఎంతో అభివృద్ధిని సాధించిందని, నూతల ఉత్పత్తులు అనేకం వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News