Wednesday, May 1, 2024

అఫ్గాన్ అతివల బతుకులకు తాలిబన్ల రాకతో తీరని అపాయం

- Advertisement -
- Advertisement -

Taliban's imminent threat to Afghan Women

అంతకు ముందునుంచీ మహిళలపై కొనసాగుతున్న గృహ హింస
90 శాతం మంది మహిళలకు భర్తల నుంచే చిత్రహింస
యుఎస్‌ఐఎడి 2015 లో నిర్వహించిన సర్వే వెల్లడి

లండన్ : అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడం అతివల బతుకులకు, వారి హక్కులకు తీరని అపాయమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారికి ఏమైనా సహాయం చేయాలనుకుంటే తాలిబన్లు స్వాధీనం చేసుకోక ముందు నుంచి చాలాకాలంగా అక్కడి మహిళలు ఎదుర్కొంటున్న హింస, తదితర సవాళ్లను మనం తెలుసుకోవలసి ఉంది. అక్కడి మహిళలు చాలామంది గత కొంతకాలంగా హింసాత్మక బెదిరింపులను ఎదుర్కొంటున్నారన్నది కఠిన సత్యం. ఆ దేశం లోని కొన్ని ప్రాంతాల్లో 90 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచే హింసను అనుభవిస్తున్నారని యుఎస్‌ఐఎడికి చెందిన డెమొగ్రాఫిక్, హెల్త్ ప్రోగ్రామ్ 2015 లో నిర్వహించిన సర్వే వెల్లడించింది. తమను హింసిస్తున్న భాగస్వాములను, కుటుంబాలను విడిచి పెట్టాలనుకుంటున్న అతివలకు తమకు రక్షణ కల్పిస్తారని విశ్వసిస్తున్న పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారుల నుంచి కూడా మరింత అపకారం ఎదురౌతున్న సంఘటనలు జరుగుతున్నాయి.

తాలిబన్లు స్వాధీనం చేసుకొనక ముందునుంచీ మహిళలకు సంరక్షణ గృహాలు ఎక్కువగా కాబూల్‌లో ఉన్నప్పటికీ వీటిని అక్కడి సమాజంలోని చాలామంది అవమానకరంగా, అక్రమంగా భావిస్తున్నారు. హింసకు గురై సంరక్షణ గృహంలో ఉంటున్న ఒకామె ఏకారణం చేతనైనా బయటకు వెళ్లడం ప్రమాదమని, డాక్టరు దగ్గరకు వెళ్లాలనుకున్నా బాడీ గార్డు తప్పనిసరి అని వాపోయింది. ప్రపంచ దేశాల ఆరోగ్య పరిస్థితుల పరిశోధనలో భాగంగా అఫ్గాన్‌లోని గృహ హింస అనుభవిస్తున్న మహిళల అనుభవాలను చిత్రీకరించడానికి గత ఐదేళ్లుగా అక్కడ తాను ఉన్నానని, మహిళలపై జరుగుతున్న హింస, మానసిక ఆరోగ్యంపై దాదాపు 200 మంది మహిళలు, పురుషులతో మాట్లాడామని పరిశోధకులు చెప్పారు. రాజకీయంగా, నైతికంగా కూడా ఇది చాలా కఠినమైన ప్రదేశమని, ఇతర దేశాల్లో హింసను ఎదుర్కొనే మహిళలను అక్కడి ప్రభుత్వ సంస్థలు రక్షిస్తుండగా, అఫ్గాన్‌లో దానికి భిన్నమైన పరిస్థితి ఉంటుందని చెప్పారు. హింసాబాధితుల పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో తాము అనేక సార్లు తమ పరిశోధనను ఆపేయవలసి వచ్చిందని వివరించారు.

అఫ్గాన్ నుంచి మహిళల హింసాత్మక గాధలను చదవడం, విశ్లేషించడం చాలా కష్టతరమైన పనిగా పేర్కొన్నారు. భర్త హింసించినా బాధించినా భర్తతో జీవించడం తప్ప వేరే దారి వారికి లేదని ఏదైనా సాయం కోరితే వారికి తిట్లు, తన్నులే ఉంటాయని పరిశోధకులు ఉదహరించారు. ఇదివరకు ఎవరూ ఈ విధంగా తమ కష్టాలను హింసల గాధలను వినలేదని పరిశోధక బృందం ముందు మహిళలు తమ గోడు వెలిబుచ్చినట్టు చెప్పారు. పురుషులకు, మహిళలకు మద్య అసమానత ఉంటోందని, పితృస్వామ్యమే గొప్పదని, లింగవివక్ష తప్పదని చెబుతుంటారని పేర్కొన్నారు. ఖురాన్ ప్రతులను దగ్గం చేసిన నేరస్థురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న ముస్లిం మహిళ మాలిక్‌జాడా కాబూల్‌లో 2015 లోహత్యకు గురి కావడాన్ని అక్కడి మహిళలు పదేపదే చెప్పుకొన్ని బాధపడుతుంటారని పరిశోధకులు తమ అధ్యయనంలో వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News