Monday, May 6, 2024

కాంగ్రెస్‌తో సీట్ల సర్ధుబాటుపై చర్చలు: సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ తో పొత్తులపై చర్చ జరుగుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళవారం హైద్రాబాద్ సిపిఐ రాష్ట్ర సమితి కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరిందన్నారు. సీట్ల సర్ధుబాటుపై చర్చిస్తున్నామని నారాయణ వెల్లడించారు. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారని నారాయణ చెప్పారు. తమకు, సిపిఎంకు ఐదేసీ అసెంబ్లీ స్థానాలు కోరినట్టుగా తెలిపారు.

మరోవైపు లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపై చర్చలను సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అప్పగించింది. లెఫ్ట్ పార్టీలతో భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సిపిఐ, సిపిఎంలకు రెండేసీ అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందని సమాచారం. .కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటుపై సిపిఐ, సిపిఎంలు చర్చించనున్నాయి. లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. లెఫ్ట్ కోరే నాలుగైదు సీట్లను ఆ పార్టీలకు కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంక్ తమ పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు ప్రతిపాదన చెడిపోకుండా ఉండేలా ఆ పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటు కుదరకపోతే సిపిఐ, సిపిఎంలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News