ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌ని భారత్ (Team India) డ్రాగా ముగించింది. ఈ సిరీస్‌లో 1, 3 మ్యాచ్‌లలో ఇంగ్లండ్ విజయం సాధించగా.. 2, 5 మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రా కావడంతో.. ఈ సిరీస్ కూడా 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. అయితే ఓవల్‌లో జరిగిన ఆఖరి టెస్ట్ చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో చివరికి మ్యాచ్‌లో భారత్ సంచలన విజయం సాధించింది.
అయితే ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భారత్ (Team India) తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఓవల్ మ్యాచ్‌కి ముందు ఈ పాయింట్స్ టేబుల్‌లో ఇంగ్లండ్ మూడో స్థానంలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నాయి. అయితే ఓవల్ మ్యాచ్ విజయంతో టీం ఇండియా.. ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి మూడో స్థానం దక్కించుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్స్ టేబుల్‌లో 100 పాయింట్లతో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆ తర్వాతి మూడు స్థానాల్లో 66.67 పాయింట్లతో శ్రీలంక, 46.67 పాయింట్లో భారత్, 43.33 పాయింట్లతో ఇంగ్లండ్ ఉన్నాయి. 16.67 విజయ శాతంతో బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ ఈ సైకిల్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమిపాలై ఆరోస్థానంలో ఉంది. న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా ఇంకా ఖాతా తెరవలేదు.
డబ్ల్యూటిసిలో భారత్ తదుపరి టెస్ట్ సిరీస్ వెస్టిండీస్‌తో ఆడనుంది. భారత్‌లో జరిగే ఈ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి.