Sunday, May 5, 2024

టీమిండియా బోణీ

- Advertisement -
- Advertisement -

దంబుల్లా : శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో శ్రీలంక బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

లంక జట్టులో కవిశా ధిలారి 47 (నాటౌట్) మాత్రమే ఒంటరి పోరాటం చేసింది. మిగతావారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక టీమిండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు అద్భుత ప్రదర్శన చేశారు. ఇక అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కూడా ఆశించిన స్థాయిలో భారీ స్కోరును సాధించలేక పోయింది. లంక బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఓపెనర్ షఫాలి వర్మ (31), జెమీమా రోడ్రిగ్స్ 36 (నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22), దీప్తి శర్మ 17 (నాటౌట్) మాత్రమే కాస్త రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News