Friday, April 26, 2024

సిఎం స్టాలిన్‌తో రాష్ట్ర బిసి కమిషన్ భేటీ

- Advertisement -
- Advertisement -

Telangana BC Commission meets with CM Stalin

తమిళనాడులో బిసి రిజర్వేషన్‌లు, కులగణన పద్దతులు, సంక్షేమ పథకాల అధ్యయనం

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంభించాల్సిన పద్దతులపై అధ్యయనం చేశామని తమిళనాడు సిఎం స్టాలిన్‌కు రాష్ట్ర బిసి కమిషన్ బృందం వెల్లడించింది. శుక్రవారం చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో సిఎం స్టాలిన్‌తో తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రదపటేల్, కిశోర్‌గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎంను శాలువతో సన్మానించి, పుస్తకాలను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలుతీరు తెన్నుల అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చినట్లు స్టాలిన్‌కు వారు వివరించింది.

మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ బిసి కమిషన్ ప్రతినిధుల బృందం తమిళనాడు బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్. తనికాచలం, బిసి, ఎంబిసి, మైనారిటీ శాఖల మంత్రి రాజకన్నప్పన్, ముఖ్యకార్యదర్శి కార్తీక్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి అముద, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై అనేక అంశాలపై ఆరాతీశారు. సత్తనాథన్, అంబాశంకర్, జనార్థనం కమిషన్ నివేదికలపై సుధీర్ఘంగా బిసి కమిషన్ బృందం చర్చించింది. ఈ సమావేశాల అధ్యయనం కొనసాగింపులో భాగంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇవికె సంపత్ రోడ్డులోని ద్రావిడ ఉద్యమ నేత ఇవి పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని వారు సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News