Thursday, May 2, 2024

మళ్లీ ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ర్యాపిడ్ టెస్టులు

- Advertisement -
- Advertisement -

సెలవు రోజుల్లో ర్యాపిడ్ టెస్టులు
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా వైద్యశాఖ ఏర్పాట్లు
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో త్వరగా రోగులను గుర్తించనున్న వైద్యులు
బస్తీ, కాలనీలో ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలతో ప్రత్యేక పరీక్షలు
చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచనలు
ఇతర దేశాల నుంచే వారికి దూరంగా ఉండాలంటున్న ఆరోగ్యశాఖ

Telangana corona cases and zones

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో చలి తీవ్రత పెరుగుతుండటంతో పాటు వరుసగా పండగలు వస్తుండటంతో కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ విజృంభించే అవకాశం ఉం దని వైద్యశాఖ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానాల్లో ర్యాపిడ్ టెస్టులు ఫిబ్రవరి వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చే స్తుంది. గత వారం రోజుల నుంచి స్ట్రెయిన్ వైరస్ వణికిస్తుంది. దీంతో అధికారులు మ రింత అప్రమత్తమైన ప్రజలు వైరస్‌కు సోకకుండా ముందు జాగ్రత్తలో భాగంగా టెస్టు లు ఎక్కువ సంఖ్యలో చేయాలని నిర్ణయించారు. గ్రేటర్‌లో 196 ఆరోగ్య కేంద్రాల్లో శివరాత్రి వరకు పరీక్షలు నిర్వహించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు సూచించడంతో సిబ్బంది సామాన్య ప్రజలకు టెస్టులు చేసేందుకు అందుబాటులో ఉండేందుకు సిద్ధమయ్యారు. ఆరునెలలుగా నగరంలో 9.10లక్షల మందికి ర్యాపిడ్ టెస్టులు చేసినట్లు, రోజుకు 50 మంది రక్త నమూనాలు సేకరించి, ఆర గంటలో ఫలితాలు వెల్లడిస్తామంటున్నారు. ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా విధుల్లో ఉంటామని, ప్రజలు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు రావాలని సూచిస్తున్నారు.

పరీక్షలు చేసిన తరువాత పాజిటివ్ వస్తే చికిత్స అందిస్తామని, వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే టిమ్స్ ఆసుపత్రులకు తరలిస్తామని, సాధారణంగా ఉంటే హోం క్వారంటైన్‌లో వైద్య సేవలందిస్తామంటున్నారు. చలికాలం కావడంతో వైరస్ రెక్కలు కట్టుకుంటుందని, దీనికితోడు నగర ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించడంలో కొంత నిర్లక్షం వహిస్తున్నారని, ఇష్టానుసారంగా రోడ్లపై తి రుగడంతోపాటు దుకాణాల సముదాయాల వద్ద గుంపులు చేరుతున్నారని, దీంతో కరోనా మరోసారి విశ్వరూపం దాల్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు.

పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి

10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్లుపైబడిన వృద్ధులు అత్యవసర పరిస్థ్దితుల్లో బయటకు వెళ్లాలని, ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరమని, 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారు అధికంగా కరోనా వ్యాధి బారినపడుతున్నారని, వీరు బయటకు వెళ్లితే ముఖానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలంటున్నారు. మాస్కు అనేది మొదటి రక్షణ కవచం, ధరించకపోతే నేరం అందుకు జరిమానా విధించవచ్చు, బయటకు వెళ్లినప్పుడు వ్యక్తుల మధ్య భౌతికదూరం 6 ఫీట్లు ఉండే విధంగా జాగ్రత్తలు వహించాలని పేర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి కావల్సిన వసతులు, శానిటైజర్ వినియోగించాలి. కొన్ని సందర్భాల్లో ప్లూ, ఇన్‌ప్లూయెంజా లక్షణాలు దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ముక్కుకారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News