Tuesday, May 14, 2024

రేపటి నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

TS EAMCET Counselling To Begin From October 9

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం(అక్టోబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 12 నుంచి 18 వరకు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఈ నెల 22వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

ఈ నెల 29 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నవంబర్ 2న ఇంజినీరింగ్ తుది విడతలో సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 4వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ప్రతి అర్థగంటకు ఒక స్లాట్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి విద్యార్థుల డాటా సేకరించడంతో పాటు ఈ సారి విద్యార్థుల కుల, ఆదాయ ధృవపత్రాలను నేరుగా రెవిన్యూ శాఖ అనుసంధానం చేశారు. విద్యార్థులు తమ కుల, ఆదాయ ధృవపత్రాల సర్టిఫికెట్ నెంబర్ నమోదు చేస్తే సరిపోతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News