Wednesday, May 8, 2024

మంచినీరు అందించడంలో చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్

షాద్‌నగర్: ప్రజలకు మంచినీరు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, దేశంలో ఎక్కడ లేని విధంగా స్వచ్చమైన తాగునీరు అంధిస్తున్నట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ వివరించారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మం డలం కమ్మదనం మిషన్ భగీరథ నీటి శుద్ది కేంద్రం వద్ద ఘనంగా తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 68,027 ఇండ్లను నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, 298ఓహెచ్‌ఆర్ ట్యాంకులను నిర్మించడం జరిగిందని, వీటి వ్యయం రూ.110.64 కోట్టు ఖర్చు చేశామని వివరించారు.

షాద్‌నగర్ మున్సిపాలిటిలో 11,500 నల్లా కనెక్షన్లు ఇవ్వడంతోపాటు 7ఓహెచ్‌ఆర్ ట్యాంకులను నిర్మించడం జరిగిందని తెలిపారు. షాద్‌నగర్‌లో రూ.433.70 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో 79.527ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని వివరించారు. వివిధ గ్రామాలలో ఇప్పటికే 321ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

కమ్మదనం నీటి శుద్ది కేంద్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమ్మదనం నీటి శుద్ది కేంద్రానికి రూ.260కోట్లు ఖర్చు చేశామని, డివిజన్‌లో 16ఓహెచ్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. షాద్‌నగర్ డివిజన్‌లోని ఆరు మండలాల ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు ఇప్పటి వరకు రూ.433.70 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు వివరించారు. ప్లోరైడ్ భారిన ప్రజలు పడకుండా ఉండేందుకు స్వచ్చమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మెన్ ఈగ గణేష్, ఎంపిపి ఇద్రీస్, జడ్పిటిసి సభ్యురాలు వెంకట్‌రాంరెడ్డి, ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, మున్సిపల్ చైర్మెన్ నరేందర్, వైస్ చైర్మెన్ నటరాజన్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ మన్నె కవిత నారాయణ, ఎంపిడిఓ వినయ్‌కుమార్‌తోపాటు మిషన్ భగీరథ అధికారులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News