Thursday, May 9, 2024

కులవృత్తులకు రూ. లక్ష పథకం చారిత్రాత్మకం

- Advertisement -
- Advertisement -
ఎంబిసి జాతీయ కన్వీనర్ కొండూరు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల సంక్షేమానికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని ,సిఎం ఆదేశం మేరకు రూ. లక్ష సాయం పథకాన్ని నిరంతర ప్రక్రియగా చేస్తూ మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని ఎంబిసి జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రటకన విడుదల చేస్తూ వలసాంధ్ర పాలకులు విస్మరించిన కుల వృత్తుల బలోపేతానికి సిఎం కెసిఆర్ నడుం బిగించి వారి ఆర్థిక బలోపేతానకై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. గతంలో దేశాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గానీ బీసిలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్టంలో బీసి, ఎంబిసీ కులాల్లో గల చేతి వృత్తుల వారి జీవన ప్రమానాలు పెంచడానికి కుల వృత్తుల్లోని ప్రతి కుటుంబాన్ని ఆధుకోవడానికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం పథకానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారని ఆయన కొండూరు అన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశంతో మంత్రి వర్గ ఉప సంఘం ఈ పథకాన్ని నిరంతర ప్రక్రియగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ పథకాన్ని రజక , నాయీబ్రాహ్మణ సహా ఎంబిసి కుల వృత్తుల వారు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News