Wednesday, April 24, 2024

రాష్ట్రంలో యథావిధిగా ఆరోగ్యశ్రీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత కొంత కాలంలో తెలంగాణలో ఆరోగ్య శ్రీ కార్డులపై వస్తున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం క్లారిటీ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ మాత్రమే అమలులో ఉంటుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరు లోగా ఆయుష్మాన్ భారత్ దరఖాస్తుకు ఆఖరి గడువంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో మేసేజులు ఫార్వార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు మీసేవా సెంటర్ల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఇదంతా తప్పుడు సమాచారం అంటూ ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో యథావిధిగా అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆశా వర్కర్లు బస్తీల్తో తిరుగుతూ ఆయుష్మాన్ భారత్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News