రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలయ్యిందని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని ఆయన గురువారం ఎక్స్ వేదికగా తెలిపారు. నియామకాల ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆర్‌టిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని నమ్మొద్దని సజ్జనార్ నిరుద్యోగులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అనుమతి మేరకే సంస్థలో పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందని, అడ్డదారుల్లో ఎవరికీ ఉద్యోగాలు రావని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఆర్‌టిసిలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తేవాలని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆర్‌టిసిలో 3,038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -