Thursday, May 2, 2024

టెన్షన్… టెన్షన్

- Advertisement -
- Advertisement -

Telangana intermediate results 2020

హైదరాబాద్: నగరం లోని ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తు న్న ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు నేడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో విద్యార్థుల్లో టెన్ష న్ నెలకొంది. ఫలితాలపై విశ్లేషణ చేస్తూ ఈ సారి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని పేర్కొంటున్నారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలోని ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ఈ సారి రెండో స్థానం సంపాదించుకుంటుందని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరం 77,033 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 1,65, 820మంది 199 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాశారు.

వీరితో పాటు 80మంది అంధ విద్యార్థులకు వెస్ట్‌మారేడుపల్లి జూనియర్ కళాశాల్లో, 60మంది డఫ్ అండ్ డం విద్యార్థులు వైఎంసీఏ కళాశాల్లో పరీక్ష లకు హాజరయ్యారు. వీరంతా ఈ సా రి పరీక్షలు మంచిగా రాసినట్లు, జిల్లాలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులై తారని వెల్లడిస్తున్నారు. జిల్లాకు నూతన కలెక్టర్‌గా శ్వేతామహంతి బాధ్యతలు చేపట్టిన తరువాత ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశం జరిపి ప్రభుత్వ కళాశాల్లో చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు బోధించి గతే డాదికంటే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించడంతో ఆయా కళా శాల అధ్యాపకులు శ్రద్ద తీసుకుని విద్యార్థులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దీంతో ఫలితాలు గడిచిన ఏడాదికంటే ఎక్కువశాతం వస్తున్నట్లు అంచనా వేస్తు న్నారు.

మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాలతో పాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెన్ ఉన్నతాధికారులు తెలిపారు. అదే విధంగా పరీక్షల్లో తప్పిన విద్యా ర్థుల కు దైర్యం చెప్పాలని, కించపరిచినట్లు మాట్లాడితే ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది పరీక్షలో ఫె యిల్ అయిన విద్యార్థులు చనిపోవడం చూస్తున్నం, అలాంటి సంఘటనలు పున రావృతం కాకుండా కుటుంబ సభ్యులే చూడాలని పేర్కొంటున్నారు. ఈ సారి తప్పి తే మరోసారి పరీక్ష రాసి పై చదువులకు వెళ్లవచ్చని మానసికంగా విద్యార్థులను సిద్ధం చేయాలని చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News