Sunday, April 28, 2024

దేశానికి మోడల్ మునిసిపాలిటీస్‌గా తెలంగాణ పట్టణాలు

- Advertisement -
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర అవార్డులను సాధించడంలో పురపాలక సంఘాలు ముందంజలో నిలిచాయి
రాష్ట్ర మునిసిపల్ చైర్మన్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్ రెడ్డి

Telangana municipalities model for the country

మనతెలంగాణ/హైదరాబాద్:  దేశానికి మోడల్ మునిసిపాలిటీస్‌గా తెలంగాణ పట్టణాలు నిలిచాయని రాష్ట్ర మునిసిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను సాధించడంలో రాష్ట్ర పురపాలక సంఘాలు ముందంజలో ఉన్నాయని, కేంద్రం ఏ పట్టణ అవార్డులను ప్రకటించినా మన రాష్ట్ర పట్టణాలు మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. కేంద్రం ప్రభుత్వం నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డును, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ ప్రగతి అవార్డులను సాధించిన పుర చైర్మన్లను హైదరాబాద్‌లోని మునిసిపల్ ఛాంబర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు రాజు వెన్ రెడ్డి మాట్లాడుతూ మన పట్టణాలు కేంద్ర స్థాయిలో అవార్డులు సాధించడానికి సిఎం కెసిఆర్, పురపాలక మంత్రి కెటిఆర్‌లేనని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతుందని, దానికి అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ అవిశ్రాతంగా శ్రమిస్తున్నారన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్, పట్టణ ప్రగతి అవార్డులు సాధించిన సూర్యాపేట, షాద్ నగర్, కల్వకుర్తి, బాన్సువాడ, శంషాబాద్, సంగారెడ్డి, ఇల్లెందు, తూప్రాన్, అలంపూర్, ఇబ్రహీంపట్నం,భూత్పూర్ తదితర చైర్మన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఉపాధ్యక్షురాలు మంజుల రమేష్, ప్రధాన కార్యదర్శి ఎడ్మ సత్యం, రాష్ట్రంలోని పలువురు మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News