Monday, May 6, 2024

జిల్లా యూనిట్‌గా మద్యం కోటా

- Advertisement -
- Advertisement -
Telangana new liquor policy
కొత్త జిల్లాల వారీగా రిజర్వేషన్లు, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ, అందులో సభ్యులుగా ఎక్సైజ్, గిరిజనాభివృద్ధి, బిసి సంక్షేమ శాఖ, ఎస్‌సి అభివృద్ధి అధికారులు

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసారి కొత్త జిల్లా యూనిట్ గా మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు దుకాణాల కేటాయింపు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీతో రిజర్వేషన్ల కేటాయింపులు చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఎక్సైజ్ అధికారి, గిరిజనాభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను వీడియో చిత్రీకరణ తప్పనిసరిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొదటి టోకెన్ ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీ, గౌడలకు వరుసగా కేటాయింపు, డ్రా పద్ధతిలోనే రిజర్వ్‌డ్ దుకాణాల ఎంపిక చేయనున్నారు.

జిల్లా యూనిట్‌గా 34 మొత్తం షాపులో ఎస్‌టీలకు షెడ్యూల్ ప్రాంతాలకు వెలుపల ఒకటి, ఎస్‌సీలకు ఐదు, గౌడ్లకు 4 మొత్తం పది దుకాణాలను ‘రోస్టర్ పాయింట్లు’ కేటాయిస్తారు. మొదటి దశలో డ్రాలో ఎస్టీకి జిఎడి033, ఎస్‌సిలకు జిఎడి011, గౌడ్ జిఎడి019 దుకాణాలను కేటాయిస్తారు. అదే విధంగా రెండో డ్రాలో ఎస్‌సి జిఎడి08, గౌడ్ జిఎడి030, మూడో డ్రాలో ఎస్సీజిఎడి027, గౌడ్ జిఎడి012, నాలుగో డ్రాలో ఎస్సీలకు జిఎడి017, గౌడ్ జిఎడి024, ఐదో డ్రాలో ఎస్‌సిలకు జిఎడి03 దుకాణాలకు ఎంపిక చేస్తారు. జిల్లా యూనిట్‌గా మొత్తంగా34 దుకాణాల్లో ఎస్‌టిలకు జిఎడి033, ఎస్‌సిలకు జిఎడి03,08, 11,17,27, గౌడ్లకు జిఎడి012,19,24,30 దుకాణాలను ఎంపిక చేస్తారు. మిగిలిన దుకాణాలు 24 ఓపెన్ విధానంలో డ్రాలో కేటాయిస్తారు. ఇప్పటికే నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు తేదీలను, వార్షిక చెల్లింపులు, నియమ నిబంధనలు పేర్కొంటూ మార్గదర్శకాలను విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News