Thursday, May 2, 2024

తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా!

- Advertisement -
- Advertisement -
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొన్న కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏడు రోజుల సమావేశాల అనంతరం ఆదివారం నిరవధికంగా వాయిదాపడింది. సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశంలో 56.25 గంటలపాటు శాసనసభ వ్యవహారాలు జరిగాయి. ఫిబ్రవరి 3న రాష్ట్రశాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి టి. హరీశ్ రావు ఫిబ్రవరి 6న రాష్ట్రశాసనసభలో 202324 సంవత్సరానికి రూ. 290396 కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు. ముఖ్యమంత్రి బిల్లుపై ఆదివారం స్వల్పకాలిక చర్చ జరిపాక శాసన సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News