Sunday, April 28, 2024

మూడంచెల వ్యూహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మూడు అంచెలుగా సమ న్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని, బూత్ కమిటీలో అయిదుగురు కీలక సభ్యులు నియమించుకొని లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపి సీట్లను గెలిచి తీరాలని సిఎం రేవంత్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అందు లో భాగంగా అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని, కార్యకర్తలకు వెన్నంటి ఉండాలని సిఎం రేవంత్ వారికి సూచించారు.

గతంలో తమకు విజయం తెచ్చిపెట్టిన మల్కా జ్‌గిరి ఎన్నికల మోడల్ ను రాష్ట్రమంతటా అనుసరించాలని రేవంత్ రెడ్డి వారికి దిశా నిర్ధేశం చేశారు. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడెంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియ మించుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంట్ నియో జకవర్గ స్థాయి కమిటీలో ఏఐసిసి పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారని, ఒక్కో పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియో జకవర్గాలున్నాయని, నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉంటారని ఆయన తెలిపారు. బూత్ స్థాయి కమిటీల్లో చురుకైన పార్టీ సభ్యులు అయిదుగురికి అవకాశం కల్పించాలని, బూత్ కమిటీలో ఉండే ఈ అయి దుగురు ఈ సారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషి స్తారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు వారే సైనికులుగా నిలబడుతారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్‌లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పనితీరుకు ప్రాతిపదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్‌లో తగిన గుర్తింపునిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో పేర్కొన్నారు. వారి పనితీరును బట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు సిఎం రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News