Saturday, September 20, 2025

క్లాస్ రూమ్‌లో టీచర్ గొంతుకోసిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రేమోన్మాది తరగతి గదిలోకి వెళ్లి టీచర్ గొంతు కోసి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమణి అనే 26 ఏళ్ల యువతి గవర్నమెంట్ స్కూళ్లో టీచర్ గా పని చేస్తుంది. గత కొన్ని రోజులుగా మధన్ అనే యువకుడు ఆమెను ప్రేమించాలని వేధిస్తున్నాడు. తనతో శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తరగతి గదిలో ఆమె చదువు చెబుతుండగా మధన్ క్లాస్ రూమ్‌లోకి వెళ్లి ఆమె గొంతు కోసి పారిపోయాడు. వెంటనే టీచర్‌ను సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News