Saturday, May 4, 2024

పోడు పట్టాలు అందజేయడం చారిత్రత్మాకం

- Advertisement -
- Advertisement -

సిర్పూర్ యు: ఆదివాసులు ఎన్నో ఎళ్లుగా ఎదురు చూస్తున్నా పోడు పట్టాల పంపిణి చేసి ఆదివాసి రైతుల జీవితలలో వెలుగునిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఅర్, తెలంగాణ ప్రభుత్వానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

బిఅర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోనేరు కోనప్ప, జిల్లా జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్ అదేశాల మేరకు మండలంలో ప్రజాప్రతినిధులతో బహిరంగ సభ విజయవంతానికి సంబంధించిన సలహాలు సూచనలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన సౌలభ్యం కోసం కుమ్రంభీం యోధుడిపేరిటా కొత్త జిల్లా ఏర్పాటు, అదే విధంగా పోరాట యోధుడు కుమ్రంభీం పోరుగడ్డ నందు 25 కోట్లతో మ్యూజీయంతో పాటు, కెరమెరి నుండి జోడేఘాట్‌కు డబుల్ రోడ్డు ఏర్పాటు చేసి గోండు గూడేలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటు చేసిన చరిత్ర తెలంగాణ సీఎం కేసిఅర్‌దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కోవ అరుణ, ఎంపిపి తోడసం భాగ్యలక్ష్మి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, వైస్ చైర్మన్ ఆత్రం ప్రకాష్, సర్పంచ్‌లు నాగోరావు, భూపతి, వీణాబాయి, జాలీంషా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News