Tuesday, May 14, 2024

హామీల అమలులో విఫలమైన బిఆర్‌ఎస్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కాంగ్రెస్ ప్రజలకు ఎంచేసిందో వారినే అడగాలని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని కుందూరు జానారెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు, తన తనయుడు కుందూరు జయవీర్‌రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్యయాత్రలో భాగంగా బుధవారం త్రిపురారం మండలంలోని కాపువారి గూడెంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ బాస్కర్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అభిమానాలతో 7పర్యాయాలు ఎమ్మెల్యేగా,18 ఏళ్లు మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించానన్నారు.

గత 40ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో తాగు, సాగునీరు. విద్యుత్, రహదారులు, ఇందిరమ్మ ఇండ్లు,తదితర మౌలిక సదుపాయాలకల్పనలో ముందుంచానని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప,ఆచరణకాని హామీలతో అధికారంలోకి వచ్చిన 9ఏళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మాయమాటలతో మీముందుకు వచ్చే ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మకుండా ప్రజలకు సేవ చేసే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని అన్నారు. అంతకుముందు చైతన్యయాత్ర రథసారథి ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కుందూరు జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డి తనయుడిగా నా తండ్రికి మీరందించిన ఆధరాభిమానాలు మరువలేనివని , అదేవిధంగా మీరు నన్ను మీ బిడ్డగా భావించి నాపై చూపిస్తున్న ఆధరాభిమానాలు మరువలేనివని అన్నారు.

జానారెడ్డి వారసుడిగా, మీబిడ్డగా , అధికార పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని చైతన్యపరిచేందుకే ఈ యాత్ర చేపట్టానన్నారు. మీ అండ ఆధరాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2లక్షల పంట రుణమాఫి, ఇంటి నిర్మాణానికి 5లక్షలు, అర్హులై భార్యాభర్తలకు ఇద్దరికీ పెన్షన్ ,500లకే గ్యాస్‌సిలిండర్, తదితర పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కాపువారిగూడెం, పలుగుతండా, మీట్యతండా, కుంకుడు చెట్టుతండా,బడాయిగడ్డలలో చేపట్టిన యాత్రలకు ప్రజలనుండి విశేష స్పందన లభించింది. గిరిజనులు అడుగడుగునా మంగళహారతులు, నీరాజనాలు పలికి కోలాటాలు, ఆటపాటలతో ,సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కర్నాటి లింగారెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్ ఎంపిసి అనుముల పాండమ్మ,జడ్పీటిసి ధనావత్ భారతి, వైస్ ఎంపిపి అవిరెండ్ల మట్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు ముడిమాళ్ల బుచ్చిరెడ్డి, అంకతి సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కాకునూరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

నియామకంః మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాపువారి గూడెంకు చెందిన గిరిజన యువనేత నేనావత్ ధర్మా నాయక్‌ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News