Thursday, May 2, 2024

అప్రమత్తంగా ఉండండి.. చైనా సైన్యం ఏ క్షణమైనా చొరబడొచ్చు…

- Advertisement -
- Advertisement -

తైపే (తైవాన్): ఈ ఏడాది చైనా సైన్యం ఏ క్షణాన్నైనా తమ భూభాగం లోకి చొరబడే ప్రమాదం ఉందని తైవాన్ రక్షణమంత్రి చూకూచెంగ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య తైవాన్ జలసంధి సమీపంలో ఘర్షణ వాతావరణంతో ఈ పరిస్థితి నెలకొంది. తైవాన్ చుట్టుపక్కల ఇటీవల కాలంలో చైనా సైన్యం కదలికలు బాగా పెరిగిపోయాయి. దీంతోపాటు దాదాపు రోజువారీగా చైనా విమానాలు తైవాన్ సమీపం లోకి రావడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో తైవాన్ పార్లమెంట్‌లో ఆ దేశ రక్షణ మంత్రి చెంగ్ మాట్లాడుతూ తైవాన్ సమీపం లోని జలాలు, గగనతలం లోకి రావడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కారణాలు వెతుక్కుంటోందన్నారు.

ఇటీవల కాలంలో తైవాన్ అమెరికా మధ్య సైనిక సహకారం పెరగడానికి ఇది కూడా కారణమని తెలియజేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హఠాత్తుగా తైవాన్ భూభాగం సమీపానికి చేరవచ్చన్నారు. చైనా ఈమేరకు సన్నాహాలు చేస్తుండటంతో ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు చెంగ్ పేర్కొన్నారు. వారు అవకాశం కోసం చూస్తుంటే కనుక నిజంగానే బలప్రయోగం చేస్తారన్నారు. చైనా తమ భూభాగం లోకి చొరబడితే కచ్చితంగా ఎదురు దాడి చేస్తామని ఇప్పటికే తైవాన్ ప్రకటించింది. మరోవైపు చైనా ప్రీమియర్ లీక్వికియాంగ్ ఆదివారం మాట్లాడుతూ తైవాన్‌తో సంబంధాలను తాము ప్రమోట్ చేస్తామని, శాంతియుత విలీనాన్ని ముందుకు తీసుకెళతామని పేర్కొన్నారు. అదే సమయంలో తైవాన్ స్వాతంత్వ్రాన్ని వ్యతిరేకిస్తామన్నారు. ఈ నేపథ్యం లోనే తైవాన్ రక్షణ మంత్రి ప్రకటన వెలువడటం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News