Friday, April 26, 2024

‘ద కేరళ స్టోరీ’ నిర్మాతలు వాస్తవిక బాధితురాళ్ల వీడియో షేర్ చేశారు!

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: నిర్మాత సుదీప్తో సేన్ తీసిన ‘ద కేరళ స్టోరీ’ వివాదగ్రస్తమయింది. అందులో అదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమా ముందు నుంచే ఎంతో వివాదాగ్రస్తమయింది. ముస్లిమేతర అమ్మాయిలను మతం మారుస్తున్నారని, వారిని ర్యాడికలైజేషన్ చేస్తున్నారని చూయించినందున ఆ సినిమా ఓ ప్రచార సినిమా(ప్రాపగండ ఫిలిం) అని విమర్శకులు అంటున్నారు.

సినిమా వాస్తవికతను త్వరలో చూపిస్తామని నటి అదా శర్మ ఇటీవల తెలిపింది. కాగా నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా యూట్యూబ్ ద్వారా వాస్తవిక బాధితురాళ్లను షేర్ చేశారు. ఆ వీడియో తాలూకు క్లిప్‌లో ఓ యువతి తాను ఎలా బలవంతంగా మత మార్పిడి గురయిందో తెలిపింది.

‘ఆరేడేళ్ల క్రితం, నేను నా ఇంజనీరింగ్ పూర్తిచేసి ఓ కార్పొరేట్ కంపెనీలో చేరాను. నా సహోద్యోగులు ర్యాడికల్ ముస్లింలు. వారు నాకు బ్రెయిన్ వాష్ చేశారు. నన్ను ఇస్లాం వైపు మళ్లేలా చేశారు. వారు మొదట నా మతం గురించి ప్రశ్నించారు. నేను ఓ స్థాయికి మించి వారిని ఎదర్కోలేకపోయాను’ అని వారిలో ఒకరు తెలిపారు.
ఆర్ష విద్య సమాజం ఆశ్రమంకు చెందిన వైశాలి శెట్టి ‘మేము 1999 నుంచి పనిచేస్తున్నాము. మేము 7000కు పైగా ఉన్నవారిని వెనక్కి తెచ్చాము’ అన్నారు.

ఆమె పాత విషయాలు గుర్తుచేసుకుంటూ ‘అథిర అనే కేరళకు చెందిన అమ్మాయి 2017లో ఇస్లాంలోకి మారింది. ఆయిషా పేరుతో ఆమె మతమార్పిడి గురైనట్లు మీడియా ఛానెల్ ద్వారా కూడా ప్రకటించారు. ఆమె ఇప్పుడు మా సంస్థకు చెందిన సనాతన ధర్మం రెండు నెలల కోర్సును పూర్తిచేసుకున్నాక ఆమె తాను ఎలా మత మార్పిడికి గురయింది తెలిపింది. తనది తప్పుడు నిర్ణయం అని ఆమె తెలుపుకుంది. అది నాడు జాతీయ వార్తగా సంచలనం అయింది’ అన్నారు.
కేరళలో మత మార్పిడి నుంచి తప్పించుకున్న యువతితో నిర్మాతలు ఈ నెల మొదట్లో పత్రికా సమావేశంలో మాటామంతీ జరిపారు. నటి అదా శర్మ బాధితురాలు షాలిని ఉన్నికృష్ణన్ పాత్రలో ఈ సినిమాలో నటించారు. కాగా షాలిని ఈ ఈవెంట్ సందర్భంగా చాలా భావోద్రిక్తురాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News