Wednesday, May 1, 2024

సత్యేందర్ జైన్ ను ఆసుపత్రిలో కలుసుకున్న కేజ్రీవాల్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు లోక్‌నాయక్ ఆసుపత్రి(ఎల్‌ఎన్‌హెచ్)కు వెళ్లి చికిత్స పొందుతున్న ఆప్ సీనియర్ నాయకుడు సత్యేందర్ జైన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆయన ధైర్యాన్ని, మొక్కవోని ధీమాను ప్రశంసించారు. అంతేఆక కేజ్రీవాల్ ట్వీట్‌లో ‘ధైర్యవంతుడిని కలిశాను…ఆయన హీరో’ అని పేర్కొన్నారు.
సత్యేందర్ జైన్ ఇటీవల తీహార్ జైల్‌లోని బాత్ రూమ్‌లో పడిపోయారు. ఆయనకు మెడికల్ పరంగా సుప్రీంకోర్టు నుంచి ఆరు వారాల బెయిల్ లభించింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టుకు పోయినందున ఐసియూలో ఉంచారు.

మొదట్లో ఆయనను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్చారు. కానీ శ్వాస సమస్యలు తలెత్తడంతో తర్వాత లోక్ నాయక్ ఆసుపత్రికి బదిలీ చేశారు. జైలు బాత్రూంలో పడిపోక మునుపే సత్యేందర్ జైన్ వెన్నెముక గాయంతో బాధపడుతున్నారు. మే 25న ఉదయం జైలు నంబర్ 7 బాత్రూమ్‌లో ఆయన కాలుజారి పడిపోయారు. ఆయనకు వీపు, ఎడమ కాలు, భుజాల్లో నొప్పి ఉంది. ప్రస్తుతం సత్యేందర్ జైన్ పరిస్థితి నిలకడగా ఉంది.
కోరుకున్న చోట వైద్యం చేయించుకునేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అయితే మెడికల్ సమర్పించాలని కోరింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది మేలో ఆయనను అరెస్టు చేసి తీహార్ జైలులో ఉంచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News