Thursday, May 2, 2024

క్వారంటైన్ 28 రోజులు

- Advertisement -
- Advertisement -

Quarantine

 

14 రోజుల్లో వైరస్ లక్షణాలు బయటపడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రైమరీ కాంటాక్ట్‌లకే కరోనా పరీక్షలు

సెకండరీ కాంటాక్ట్‌లకు 28 రోజుల ఇంక్యుబేషన్ తప్పనిసరి

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణ యం తీసుకుంది. క్వారంటైన్ పీరియడ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు బుధవారం సిఎస్ సోమేష్‌కుమార్ డిజిపి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న 14 రోజు ల ఇంక్యుబేషన్ పీరియడ్‌ను 28 రోజులకు పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 14 రోజుల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు బయటపడకపోవడం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు కొవిడ్ పాజిటివ్ వ్యక్తిని ప్రత్యక్షంగా కలసిన వారికి(పైమరీ కాం టాక్ట్) మాత్రమే కరోనా టెస్టులు చేయాలని, సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా టెస్టులు చేయవద్దని సిఎస్ అధికారులు సూచించారు. రాష్ట్రంలో ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ ఆయా జిల్లాల అధికారులకు ఆదేశించారు.

ఎందుకు ఈ నిర్ణయం…..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కొవిడ్ పాజిటివ్ వ్యక్తులతో ప్ర త్యక్షంగా కలసిన కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులను 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాల్సిందిగా గతంలో డబ్లూహెచ్‌ఒ సూచించింది. ఈక్రమంలోనే అన్ని రాష్ట్రాల్లో 14 రోజుల పాటు క్వా రంటైన్ పీరియడ్ కొనసాగించాయి. అయితే తా జాగా వస్తున్న కేసులు పరిశీలిస్తే సుమారు 1 నుం చి 25 రోజుల వరకు వైరస్ నిర్దారణ కావడం లేదు. దీంతో డబ్లూహెచ్‌ఒ సూచనల మేరకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు క్వారంటైన్ పీరియడ్‌ను పెంచాయి. ఇప్పటికే కేరళలో ఈ నిబంధన కొనసాగుతుండగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా క్వా రంటైన్ పీరియడ్‌ను పెంచింది. ఈక్రమంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ఖచ్చితంగా 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల్లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది.

ఇప్పటి వరకు ప్రైమరీ, సెంకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు చేస్తుండగా, తాజా నిబంధనల్లో కేవలం ప్రైమరీ కాంటాక్ట్‌లకు మాత్రమే కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే సెంకండరీ కాంటాక్ట్‌లు మాత్రం 28 రోజుల పాటు ఖచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని, ఈ సమయంలో అనుమానిత లక్షణాలు బయటపడితే వెంటనే కరోనా టెస్టులు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 28 రోజుల లోపు లక్షణాలు కనిపించకపోతే సదరు వ్యక్తికి క్వారంటైన్ గడువు ముగిసినట్లు ప్రకటిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై కొంత మంది అధికారుల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుందని, 28 రోజుల తర్వాత కూడా క్వారంటైన్ ముగిసిన వాళ్లకు పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటని? పలువురు నిపుణుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో కోలుకున్న వారికి మళ్లీ కరోనా సోకడమే దీనికి ఉదాహరణగా వారు విశ్లేశిస్తున్నారు.

కావున 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న వారికీ ఖచ్చితంగా టెస్టులు చేసే ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కిట్ల కొరత ఉండటం వలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మరి కొందరి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కానీ మార్చి 2 తేదిన రాష్ట్రంలో నమోదైన తొలి కేసు నుంచి ఇప్పటి వరకు సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేసినా, పాజిటివ్ తేలడం లేదని, దీంతో ప్రభుత్వానికి సమయం వృధా అవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా కిట్లు తక్కువగా ఉన్నాయనే వాదనలో నిజం లేదని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా మహాబూబ్‌ఖాన్ పేర్కొన్నారు. అందరికి టెస్టులు చేయాల్సిన అవసరం లేదని, అనుమానిత లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కూడా సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే 14 రోజుల పూర్తి చేసుకున్న వారి పరిస్థితి ఏమిటీ..?
మరో వైపు రాష్ట్రంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి సుమారు 25వేల మందికి పైగా ప్రభు త్వం విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేసింది. మరోవైపు మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కూడా క్వారంటైన్ పీరియడ్ ముగిసింది. అయితే వీళ్లకు వైరస్ లక్షణాలు ఏమైనా వస్తున్నాయా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాల వారిగా ప్రత్యేక టీంల ద్వారా వీరిపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా, టెస్టులు చేసి, వైద్యం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అధికారులు నిరంతర కృషి చేస్తున్నామని, ప్రజలెవ్వరూ భయబ్రాంతులకు గురికావొద్దని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు.

 

The Quarantine is 28 days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News