Sunday, May 12, 2024

రాహుల్.. పిపిఇలపై అసత్యాలొద్దు

- Advertisement -
- Advertisement -

KTR

 

మీరు చెప్పిన దానికి వందరెట్లు అధికంగా ఉన్నాయని నిరూపిస్తే క్షమాపణ చెబుతారా? ట్విట్టర్‌లో కెటిఆర్ సవాల్

మనతెలంగాణ /హైదరాబాద్: తెలంగాణలో ఉన్న పిపిఇ కిట్ల సంఖ్యపై ఇండియా టూడే గ్రూప్ పాత్రి కేయులు రాహుల్ కన్వాల్ చేసిన ట్వీట్‌పై మంత్రి కెటి ఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఖచ్చితమైన సమా చారం లేకుండా అర్థం లేని అవాస్తవాలు రాసి, విపత్కర సమయంలో ప్రజలను గందరోళా నికి గురిచేయొద్ద న్నా రు. ఇండియా టూడే గ్రూప్ రిపోర్టర్ రాహుల్ వివిధ రాష్ట్రాలలో ఉన్న పిపిఇలపై వచ్చిన ప్రచురణను ట్విట్టర్ లో ఉంచారు. దీనిపై కెటిఆర్ ఘాటూగా బదులిచ్చారు. తెలంగాణలో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్స్ కేవలం 3,132 మాత్రమే ఉన్నాయని చెప్పడం పూర్తి అసత్యం అన్నారు. ఈ సంఖ్య కన్నా వందరేట్లు అధికంగా పిపిఇలు ఉన్నాయని నిరూపిస్తే క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించారు. సారీ.. ఇది అవమా నం కలిగించే, అవగాహనరాహిత్య జర్నలిజమంటూ ట్వీట్ చేశారు.

 

No lies on PPEs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News