Monday, May 13, 2024

సరి-బేసి షాపులు

- Advertisement -
- Advertisement -

The stores will be open day after day

 

అతిక్రమిస్తే కఠిన చర్యలు : బల్దియా హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా గ్రేటర్‌లో దుకాణాలు రోజు విడిచి రోజు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సరి, బేసి సంఖ్య విధానంలో షాపులను తెరిచుకునే విధంగా బల్దియా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ వ్యాప్తం గా ప్రధాన మార్కెట్లు, వరస క్రమంలో ఉన్న అన్ని షాపులకు అధికారులు నంబర్లు కేటాయిస్తున్నారు. ఈ నంబర్ల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లు మినహాయించి నగరంలో మరిన్ని దుకాణాలు రోజు విడిచి రోజు తెరుచుకుంటాయి. ఇందుకు సంబంధించి గ్రేటర్ 30 సర్కిళ్లలో బల్దియా అధికారులు మంగళవారం దుకాణాలకు నంబర్ మార్కింగ్ ప్రక్రియను చేపట్టారు.

ఈ ప్రక్రియ జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో కొనసాగుతుండగా, సర్కిళ్ల వారిగా డిప్యూటీ కమిషనర్ల యుద్ధ ప్రాతిపదికన నంబర్ల కేటాయింపులు పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కిరాణా, మెడికల్ పాల కేంద్రా లు, కూరగాయాలు, పండ్ల విక్రయ షాపులు మాత్రం యధావిధిగానే కొనసాగనున్నాయి. అదేవిధంగా మాల్స్, రెస్టారెంట్లు, బార్స్, పబ్స్, సినిమాహాళ్లు, స్విమింగ్ పూల్స్, స్టడీ సెంటర్లు, జిమ్స్, స్పోర్ట్ క్లబ్స్, క్లబ్స్‌లను మాత్రం ప్రభు త్వం ఆదేశాల వచ్చేంత వరకు మూసి ఉండనున్నాయి. అయితే రెస్టారెంట్లు ద్వారా కేవలం టేక్‌అవేకు మాత్రం అనుమతించనున్నారు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా మం గళవారం నుంచి దుకాణాలన్ని రోజు విడిచి రోజు తెరుచుకోన్నాయని జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా నిబంధనలు ఎవరూ అతిక్రమించినా లాక్‌డౌన్ పూరైయ్యే వరకు ఆయా దుకాణాలను మూసివేస్తామని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిబేసి సంఖ్యలో దుకాణాలను తెరవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మలక్‌పేట్ సర్కిల్‌లో కొనసాగుతున్న దుకాణాల నంబరింగ్ పనులను ఆయన పరిశీలించారు. దుకాణాల యజమనానులు ప్రభుత్వం కేటాయించిన నంబర్ల ప్రకారం రోజు విడిచి రోజు మాత్రమే షాపులు తెరవాల్సి ఉంటుందని తెలిపారు. షాపుల నిర్వహణపై నిరంతరం నిఘా కొనసాగడంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయని, లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. షాపుల్లో పని చేస్తున్న వ్యక్తులందరూ విధిగా మాస్కులు ధరించాలి. కొనుగోలుదారులు సైతం మాస్కులు ధరించి షాపులకు వెళ్లాలి. నో మాస్కు, నో గూడ్స్, నో సర్వీస్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి . మాస్కు నిబంధనను అతిక్రమిస్తే రూ.1000ల జరిమానా. 4 అడుగులు భౌతిక దూరం పాటించాలి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News