Sunday, April 28, 2024

నీటి విడుదల ఆపాలి

- Advertisement -
- Advertisement -

Krishna Board Notice for Andhra Pradesh

 

ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాబోర్డు తాఖీదు
కృష్ణ జలాలను ఇప్పటికే అధికంగా వాడుకున్నట్టు సష్టీకరణ
సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, మచ్చుమర్రి నుంచి పరిమితికి మించి విడుదల చేసిన పొరుగు రాష్ట్రం
తాజా కేటాయింపులు చేసేంతవరకు నీరు వదలొద్దని నోటీసు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేటాయింపుల కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానదీ జలాలను వాడుకుందని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరం కేటాయించిన నీటి కంటే ఎపి అదనంగా నీటిని వినియోగించుకుందని అంకెలతో సహా కృష్ణానదీ బోర్డు యాజమాన్యం స్పష్టం చే సింది. తాజాగా కేటాయింపుల ఉత్తర్వులు వె లుబడేంతవరకు నీటి తరలింపును నిలపివేయాలని ఆదేశిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమే శం ఎపి జలవనరుల శాఖకు నోటీసు ఇచ్చా రు. ఈ నోటీసుకు ఎపి ప్రభుత్వం ఎలాంటి వివరణలు, ఫిర్యాదులు ఇచ్చినా బోర్డు అంగీకరించదని ఆయన నోటీసులో స్పష్టం చేశారు. కృష్ణానదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఆంధ్ర పోరాట పంథా లో సాగుతుండగా కృష్ణా రివర్ బోర్డు ఏపి ప్రభుత్వానికి షాక్ ఇవ్వడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఎపి కృష్ణానదీ జలాలను అధికంగా వినియోగిస్తుందనే అంశానికి స్పష్టత వచ్చింది.

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థం పెంచుతూ సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ జిఒ 203 ఇవ్వడం ప్రశ్నార్థకమైంది. కృష్ణానదీ జలాలను అదనంగా వినియోగించడం నిలిపివేయాలని కృష్ణారివర్ బోర్డు తాఖీదు పంపించడంతో ఆ రాష్ట్రం తప్పుడు వాదనలతో ముందుకు వచ్చిందని స్పష్టం అయింది. తెలంగాణప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు ఈ లేఖతో తెలిసిపోయింది. కృష్ణానదిలో నీళ్లులేవనీ గోదావరి జలాలను వాడుకోవాలని స్నేహపూర్వకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించిన అంశానికి మరింత బలం చేకూరింది. అయితే రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న తరుణంలో కృష్ణా రివర్ బోర్డు ఎపికి షాక్ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్లితే ప్రస్తుత నీటి సంవత్సరం (1జూన్ 2019 నుంచి నేటివరకు)లో కృష్ణాబోర్డు కేటాయించిన నీటిని తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా పంచుకుని ప్రాజక్టులకు విడుదల చేయాల్సి ఉంటుంది.

అయితే కేటాయింపుల కంటే 20 శాతం నీటిని ఆంధ్ర అధికంగా వినియోగించుకున్నట్లు నోటీసులో పేర్కొంది. ప్రధానంగా నాగార్జున సాగర్ కుడికాల్వ, హంద్రీనివా, ముచ్చుమర్రి నుంచి కృష్ణాజలాలను అధికంగా ఎపి తోడుకోవడంతో పాటు మరో 80 క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడుకు తరలించేందుకు జిఒ 203 విడుదల చేసింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడుకు 169.668 టిఎంసిలు, హంద్రీనివాకు 41.914 టిఎంసిలు, ముచ్చిమర్లకు 5.410 టిఎంసిలను ఎపి తరలించింది. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ 148.806 టిఎంసిలు నీటిని వినియోగించగా ఆంధ్రప్రదేశ్ 349.069 టిఎంసిల నీటిని తోడుకుందని కృష్ణా బోర్డు ఉదహరించింది. కృష్ణా నదీ జలాల నుంచి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎపి ప్రభుత్వం 647.287 టిఎంసిలు వినియోగించాల్సి ఉండగా 20శాతం అధికంగా నీటిని తోడుకున్నట్లు కృష్ణాయాజమాన్యం బోర్డు నోటీసులో పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణపై ఎపి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందని ఈ నోటీసుతో స్పష్టం అయింది.

ప్రాజెక్టులపై తెలంగాణను వివరాలు అడిగిన కెఆర్‌ఎంబి

పాలమూరు రంగారెడ్డి, దిండి, భక్తరామదాసు ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు తెలంగాణ నీటిపారుదల శాఖను కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణాబోర్డు ఈ మేరకు తెలంగాణరాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌కు లేఖ రాసింది. ఎపి ఫిర్యాదులో పేర్కొన్న వివరాలను తెలియచేయాలని లేఖలో కోరింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాలని కోరిన బోర్డు ప్రాజెక్టుల డిపిఆర్‌లను కూడా కోరింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బిసి సామర్థం పెంచారని ఎపి సర్కార్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో బోర్డు ఈ లేఖ రాసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News