Sunday, April 28, 2024

మతం, కులం, పురుషాహంకారంతో వ్యవస్థ అస్తవ్యస్తం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట రూరల్ : చరిత్ర రేపటి తరానికి తెలియకుండా పాలకుల కుట్రలు చేస్తున్న పరిస్థితులు చాలా బాధను కలిగిస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సత్యాలక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో కాలం మరువని యోధులు చెవ్వ రఘుపతి వ్యాసాలు పుస్తకావిష్కరణ సభకు ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య వక్తగా పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ అధ్యక్షతన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితులలో రచయిత రఘుపతి రాసిన కాలం మరువని యోధుల పుస్తక ంలోని 12 వ్యాసాలు ఆనాటి ఉద్యమ పరిస్థితులు, ప్రధానంగా ఆదివాసి లలిత, బడుగు, బలహీన వర్గాల ఔన్నత్యం నేటి తరానికి కావాల్సిన చరిత్ర సత్యాలను మరొకసారి వాటి లోతులను అధ్యాయ నం చేసి రానున్న తరాలకు అందజేసిన ప్రయత్నం చాలా అభినందనీయమని కొనియాడారు.

పాలకుల కుట్రలు: ఈ దేశంలో చరిత్ర సత్యాలను వాటి ప్రభావాలను రానున్న తరాలకు పూర్తిగా తెలియకుండా వాస్తవాలను వక్రీకరణ చేస్తూ అసత్య చరిత్ర వ్యాసాలను హిందూ భావజాలంతో కూడుకున్నొక విచిత్ర పరిస్థితులను సమాజం ముందుకు తెచ్చేలా ఈ దేశా న్ని పాలిస్తున్న పాలకులు మన ముందుకు తెవాల్సి న అవసరం ఎంతైనా ఉందని ఆవేదన వ్యక్తం చేశా రు. వాస్తవ పరిస్థితులకు మాట్లాడుతున్న సందర్భ ంలో ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ఆదివాసి, ఇత ర దళిత వర్గాలపై జరుగుతున్న దాడులను,

అలాగే రాజ్యాంగం ప్రభావం లేకుండా చేసేందుకు సీరియస్‌గా మతం పేరుతో దాడుల పరంపర కొనసాగుతుందని విమర్శించారు. ప్రజల కోసం పోరాడుతున్న, నిలబడుతున్న వారిపై ఇలాంటి కేసులను పెట్టి అణిచివేసే ధోరణి, ఈ పాలకులు చేస్తున్న తీ రును అందరం పసిగడ్డి ప్రజా ఉద్యమాలవైపు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

ఉత్తర భారతదేశంలో: ఈ దేశంలో ఆదివాసిలు వారి బ్రతుకు దెరువు కో సం గత ఐదు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారని అదే ప్రభావం నల్లమల ప్రాంతంలో ఉన్న చెం చు, ఆదివాసి గిరిజనులు, సాంస్కృతి, సాంప్రదా యం, జీవించే హక్కు పాలకులు వారికి కల్పించాల్సిన మౌళిక వసతులపై అనేక పోరాటాలు కొనసాగించేందుకు నిదర్శనమన్నారు. ఉత్తర భారత దేశం లో దళితులపై దాడులు జరుగుతున్న తీరు హృద య విధానకర సంఘటనలు చూస్తుంటే చాలా బాధిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రభావాలు అస్తవ్యస్తం అదే భావజాలం ఉన్న వారు ఈ దేశాన్ని పాలిస్తూ ఆ ప్రభావాలతోనే అధికారంలకి వస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు.

జర్నలిస్టు సుజాత.. ఈ దేశంలో జరుగుతున్న విభిన్నకర వాస్తవ పరిస్థితులను తన వ్యాసాల ద్వారా తెలుపుతున్న జర్నలిస్టు సుజాతపై జరుగుతున్న దాడి, వివక్ష, వ్యతిరేక పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడి సఫాయి కార్మికుల గురించి గొప్ప అభివర్ణించారు కానీ రచయిత రఘుపతి చెంచు, దళిత, సఫాయి గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యిల్ని కళ్లకు కట్టినట్లు చూపారని అలాంటి ఆలోచన, మన ముందు ఉన్న సమస్యలపై ఆలోచన చేయలేని దుస్థితిలో ఉన్నామని చర్చ జరగాలని కోరారు.

విద్యలో ఆశించిన మార్పులు లేవు: తెలంగాణ వస్తే రాష్ట్రంలో ప్రధానంగా విద్యపై స మూలమైన మార్పులు వస్తాయని ఆశించామని, అ లా జరగడం లేదని బాధ వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ రచన విధానాలను, బుద్ధిజం, కుల ప్రభావం, స్త్రీ అసమానతలు చరిత్ర తెలుసుకోకు ండా ఒక పిల్లవాడు ప్రాథమికొన్నత విద్య వరకే పరిమితమై గిరిజనులు, దళితులు, మిగతా స మాజం విద్యకు దూరం చేయడమే, కేవలం కులవృత్తులకు పరిమితమయ్యేలా కుట్ర జరుగుతుందన్నారు.

ఈ దేశంలో మత ప్రభావంతో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, మతం, పురుష అహ ంకారంతో నేటి యువతరం చెడువైపు అడుగులు వేస్తుందని, అదంతా పసిగట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు శాతవాహన విశ్వవిద్యాలయం సుజాత మాట్లాడుతూ నేడు ఆదివాసి, ఇతర వర్గాల గురించి మాట్లాడిన, జతకట్టిన నేడు రాజ్యం మావోయిస్టులతో సంబంధాలు కట్టడం దుర్మార్గమని, వాస్తవాలు, ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ఇంకో రకంగా చూడడం రాజ్యానికి తగదన్నారు. ఈ సమావేశంలో పాలమూరు అధ్యాయన వేదిక రాఘవాచారి, ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ అసొసియేషన్ బైరెడ్డి సతీష్, నారాయణ, గాజుల లక్ష్మి నారాయణ, చెవ్వ పాండు, నాసరయ్య, గోపాల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News