Sunday, April 28, 2024

జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తా

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం రోజు జిల్లా కేంద్రంలో ఒక ఎకరా ప్ర భుత్వ స్థలంలో తన సొంత నిధులు మూడు కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో జిల్లా సైన్స్ మ్యూ జియాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని జిల్లా సైన్స్ ఫోరం సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జి ల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయ డం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మారుమూల గ్రామీణ పేద విద్యార్థుల్లో సృ జనాత్మక ఆలోచనలు మరింతగా వస్తాయనే సంకల్పంతోనే సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన తనకు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

నా గర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత నాగర్‌కర్నూ ల్ జిల్లా విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సైన్స్ పోటీల్లో సత్తా చాటుతున్నారని వారిని మరింత ప్రొత్సహిస్తే శాస్త్ర సాంకేతిక రంగాల్లో జిల్లా విద్యార్థులు రాణిస్తారని అన్నా రు. సైన్స్ ఆవిష్కరణలు విద్యార్థి ఎదుగుదలలో ఎ ంతగానో ఉపకరిస్తాయని, అందుకే విద్యార్థులకు జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం పనులను ఈ నెల చివరి నాటికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభిస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.

ఫోరం సభ్యుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడారు. నూతన కలెక్టరేట్ పరిసర ప్రాం తాల్లో ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వాలన్ని ఎమ్మెల్యే కోరగా అందుకు జిల్లా కలెక్టర్ అనుకూలంగా స్పందించారు. జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూ జియం ఏర్పాటు మంచి ఆలోచన అని మంగళవారం సమావేశమై ప్రభుత్వ స్థలాన్ని ఫైనల్ చేద్దామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జి ల్లా విద్యార్థులు అనేక సైన్స్ పోటీల్లో ప్రతిభ చాటుతున్నారని, నూతన ఆవిష్కరణలు చేపట్టే విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తుంది.

విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు చేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ పేర్కొంటుందన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని సైన్స్ ప్రయోగశాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. కాగా జిల్లా కేంద్ర ంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చొరవతో మూ డు కోట్ల రూపాయలతో అత్యాధునిక సైన్స్ మ్యూజియానికి భవనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడంపై డిఎస్‌ఓ కృష్ణా రెడ్డి, సైన్స్ టీచర్ ఫోరం నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.

జిల్లాలో విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను సొంత నిధులతో అత్యాధునిక భవనాలను నెలకొల్పుతున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని నల్లమల బయోసైన్స్ ఫోరం సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు నాగరాజు, నల్లమల బయోసైన్స్ ఫోరం జిల్లా కార్యదర్శులు వెంకటయ్య, శేఖర్ గౌడ్, రమేష్, మురళి, సురేష్ బాబు, జహీర్, సురేష్ బాబు, కిరణ్ శ్రీనివాస్, చాంద్ పాషా, జగదీశ్వర్ రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News