Tuesday, April 30, 2024

ట్రంప్ పై అభిశంసన

- Advertisement -
- Advertisement -

The trial over Trump's impeachment in Senate began

 

అడ్డుకోడానికి రిపబ్లికన్ల విఫలయత్నం… అభిశంసన నెగ్గడానికి మరో 11 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై సెనేట్‌లో ప్రవేశ పెట్టిన అభిశంసనపై మంగళవారం విచారణ ప్రారంభమైంది. క్యాపిటల్ హిల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు, అంతకు ముందు ఆందోళన కారులకు ట్రంప్ చేసిన వినతులు ఇవన్నీ సభలో చూపించడంతో విచారణను ప్రారంభించారు. పదవీ విరమణ తరువాత అధ్యక్షునిపై అభిశంసన చేపట్టడం చారిత్రకంగా ఇది రెండోసారి. 18 వ శతాబ్దంలో భారత్‌కు మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్‌పై పదవీ విరమణ తరువాత అభిశంసన చేపట్టారు. మంగళవారం సెనేట్ నిర్వహించిన ఓటింగ్‌లో ఇరువైపులా 5644 ఓట్ల తేడాతో అభిశంసన చేపట్టడానికి సెనేట్ నిర్ధారించింది. పదవిలో లేని అధ్యక్షునిపై అభిశంసన చేపట్టడానికి అంగీకరించబోమని ట్రంప్ సొంతపార్టీ రిపబ్లికన్లు చేసిన వాదన ఓటింగ్‌లో నెగ్గలేదు.

ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు డెమోక్రాట్లకు మద్దతు పలకడం గమనార్హం. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు చెరో 50 మంది వంతున సెనేట్‌లో సభ్యులుగా ఉండడంతో ట్రంప్‌పై అభిశంసన నెగ్గడానికి 67 ఓట్లు అవసరం. అయితే ఆరుగురు రిపబ్లికన్లు డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుండడంతో కనీసం మరో 11 మంది రిపబ్లికన్ల మద్దతు సెనేట్‌కు అవసరం. సెనేట్‌లో మూడొంతుల మంది మద్దతు ఉంటేనే అభిశంసన తీర్మానం చెల్లుతుంది. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ ట్రంప్ చేసిన తప్పులను ఎత్తి చూపించడానికి డెమోక్రాట్లు ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. బుధవారం నుంచి రెండు వైపుల నుంచి అంటే అభిశంసనకు సంబంధించిన చట్టసభ మేనేజర్లు, ట్రంప్ న్యాయవాదుల మధ్య 16 గంటల పాటు అభియోగాలపై వందమంది సభ్యుల సెనేట్ ముందు వాదనలు జరుగుతాయి.

ఈ సందర్భంగా ఇంపీచ్‌మెంట్ మేనేజర్ జేమీ రస్కిన్ ఈ విచారణ రాజ్యాంగపరంగా జరుగుతుందని మద్దతు పలికారు. వాస్తవాలను వెలికి తీయడానికే ఈ విచారణ అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు తాలూకు వాస్తవాలను వినడానికి సిద్ధమైన సెనేట్‌ను అడ్డుకోడానికి ట్రంప్ తన న్యాయవాదులను పంపారని, ఏ సాక్షం వినిపించనీయకుండా ప్రయత్నించారని చెప్పారు. ఇంగ్లీష్ చరిత్ర ప్రకారం మాజీ అధ్యక్షులు తాము పదవిలో ఉన్నప్పుడు జరిగిన అధికార దుర్వినియోగానికి జవాబు దారీ కావలసి ఉంటుందని సెనేట్‌లో రష్కిన్ ప్రసంగ పాఠం చెబుతోంది. ఈమేరకు అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న మొట్టమొదటి అధ్యక్షుడు ట్రంప్ అవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News