Sunday, April 28, 2024

బతుకుతాననే ఆశలేదు

- Advertisement -
- Advertisement -

There is no hope of survival: Manoj geete

అయినా ఏడేనిమిది గంటలు ఎదురీత

ముంబై : ఓ వైపు కుండపోత వాన పది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలు, ఎటుపోతున్నామనేది తెలియని చీకటి అయినా బతుకు కోసం ఆరాటం. ఇది ఇటీవలి తౌక్టే తుపాన్ క్రమంలో ముంబై తీరంలోని ఆయిల్ నౌక సిబ్బందిలోని ఓ వ్యక్తి స్పందన. బుధవారం ఉదయం ఐఎన్‌ఎస్ కొచ్చి వార్‌షిప్ 125 మంది సిబ్బందిని అలల ధాటి నుంచి రక్షించి ముంబై తీరానికి తీసుకువచ్చింది. అత్యంత బలీయమైన గాలులతో ముంబై తీరంలో లంగర్ వేసుకుని ఉన్న రెండు నౌకలు కల్లోల సముద్రంలోకి కొట్టుకుపోయ్యాయి. నౌకలు సుడులు తిరుగుతూ ఎందరో సముద్రంలోకి దూకేశారు. తాను ఏ విధంగా బతికి బయటపడ్డానో తనకే తెలియడం లేదని ఇప్పుడు తీరానికి చేరుకున్న సిబ్బందిలో ఒకరైన వర్క్‌మెన్ మనోజ్ గీతే తెలిపారు.

అప్పుడు తుపాన్ సమయంలో నౌకలో పరిస్థితి భీకరంగా ఉందని, తాను సముద్రంలోకి దూకేశానని, దిక్కుతోచనిస్థితిలో ప్రాణాలను బలంగా కాళ్లలోకి పంపిస్తూ గంటల కొద్ది ఈదుకుంటూ గడపాల్సి వచ్చిందని. ఈ లోగా నౌకాదళ సిబ్బంది తమను కాపాడారని, ఇప్పుడు తీరానికి చేరుకున్నానని మనోజ్ తెలిపారు. గీతేకు 19 ఏండ్లే. కొల్హాపూర్‌కు చెందిన వాడు. తమ నౌక మునిగిపోతూ ఉండటంతో ఇతర వర్కర్లతో కలిసి తాను లైఫ్ జాకెట్ వేసుకుని సముద్ర జలాలలోకి దూకినట్లు తెలిపారు. గత నెలలోనే ఈ యువకుడు నౌకలో హెల్పర్ పనికి ఉద్యోగంలో చేరాడు. తుపాన్ ధాటికి తన సర్టిఫికెట్లు, సెల్‌ఫోన్ అన్నీ పొయ్యాయని చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News