Friday, May 10, 2024

రాజ్‌భవన్ గేట్ వద్ద గొర్రెల మంద: గవర్నర్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Bengal guv serious over sheeps protest at Raj bhavan

కోల్‌కతా: నగర పోలీసు విభాగం తీరుతెన్నులపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు ఏకంగా రాజ్‌భవన్ ప్రధాన గేట్ వద్దకు ఏకంగా గొర్రెలు, మేకలు మందలు తీసుకురావడం ఏమిటీ? పోలీసు బృందం ఇక్కడ తమాషా చూస్తున్నట్లు చూడటం ఏమిటీ? పైగా ఓ గొర్రె మీద తన పేరు రాయడం ఏమిటని ప్రశ్నించింది. సంబంధిత అంశంపై వెంటనే తనకు సమాధానం ఇచ్చుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అధికార పార్టీ టిఎంసి కి చెందిన ఇద్దరు మంత్రులను, నేతలను ఇటీవలే సిబిఐ అరెస్టు చేయడం, విచారణకు సిబిఐ కార్యాలయానిక తరలించడం, అక్కడికి సిఎం మమత వచ్చి గంటల తరబడి ఉండటం, రాష్ట్రంలో పలు చోట్ల టిఎంసి కార్యకర్తల నిరసనలు చెలరేగడం వంటి పరిణామాల మధ్యలో రాజ్‌భవన్ వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగాయి.

గవర్నర్ అనుమతితోనే మంత్రులపై సిబిఐ విచారణకు వీలేర్పడిందని తెలియడంతో టిఎంసి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందనేది చెప్పడానికి చివరికి రాజ్‌భవన్ వద్దకు గొర్రెల దండు చేరుకోవడం ఒక్కటి చాలు అని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉండగా ప్రధాన గేట్ వద్దకు నిరసనకారులు ఏ విధంగా చేరుకుంటారని గవర్నర్ ప్రశ్నించారు. రాజ్‌భవన్ గేట్ల వద్ద దాదాపు రెండు గంటల పాటు అల్లరి మూకలు భైఠాయించుకుని ఉండటం, పోలీసులు వారిని ఏమీ అనకుండా తమాషా చూస్తున్నట్లుగా గడపటం ఇవన్నీ మితిమీరుతున్న పరిణామాలని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bengal guv serious over sheeps protest at Raj bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News