Tuesday, April 30, 2024

నేడు సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదు

- Advertisement -
- Advertisement -

మతం, భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేసుకోబోం
కర్ణాటక ప్రభుత్వం లక్ష్యంగా బిజెపి చేసిన విమర్శలపై కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్: అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా ఈనెల 22వ తేదీన సెలవు ప్రకటించరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ సమర్ధించుకున్నారు. అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 22వ తేదీన సెలవు ప్రకటించకపోవడంపై కర్ణాటక ప్రభుత్వం లక్ష్యంగా బిజెపి పార్టీ చేసిన విమర్శలపై కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మతం, భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేసుకోబోమని ఆయన అన్నారు. కర్ణాటకలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయాల్లో తమ మంత్రులు సైతం పూజలు చేస్తున్నారని, తమ పూజలు ఫలిస్తాయని డికె శివకుమార్ వ్యాఖ్యానించారు.

అందరూ ప్రార్థనలు చేయాలని తాము కోరుతున్నామన్నారు. సిద్ధరామయ్య పేరులో రామ ఉందని, తన పేరులో శివ ఉందని, తమను ఏ ఒక్కరూ ఒత్తిడి చేయలేరన్నారు. తమ కర్తవ్యాన్ని తాము నెరవేరుస్తామన్నారు. జనవరి 22వ తేదీన పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని మోడీ సర్కార్ కొందరు ఎంపిక చేసిన నేతలు, సిఎంలనే ఆహ్వానిస్తోందని, దేశంలో ఎందరో నేతలు, సిఎంలు ఉన్నారని డీకే శివకుమార్ అన్నారు. అయోధ్య రామాలయం ప్రైవేట్ ఆస్తి కాదని, అది ప్రజల సొత్తు అని ఏ మతం, చిహ్నం ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదని ఆయన పేర్కొన్నారు.మరోవైపు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు కర్నాటక సిఎం సిద్ధరామయ్య, డికె శివకుమార్లు హాజరు కావడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News